Anantapur: అచ్చం సినిమాలోలాగే.. తాళికట్టు వేళ మండపానికి వచ్చిన పోలీసులు.. కట్ చేస్తే

ఇంకా కొద్దిసేపు ఉంటే వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేసేవాడు. ఇంతలోనే పోలీసులు మండపానికి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పెళ్లి ఒక్కసారిగా ఆగిపోయింది. అసలు ఏం జరిగింది.. ఎవరిది తప్పు వివరాలు తెలుసుకుందాం పదండి.

Anantapur: అచ్చం సినిమాలోలాగే.. తాళికట్టు వేళ మండపానికి వచ్చిన పోలీసులు.. కట్ చేస్తే
Wedding Stopped

Updated on: May 21, 2023 | 1:59 PM

పెళ్లైన యువకుడు, తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన భార్య, ఆమె తరఫు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. డైరెక్ట్‌గా పెళ్లిమండపానికి వెళ్లిన పోలీసులు రెండో పెళ్లి నిలిపివేశారు. ఈ ఘటన అనంతపురంజిల్లా గుత్తిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన సుభాష్‌ అనే యువకుడికి రెండేళ్ల క్రితం అంబర్ పేట్‌కి చెందిన శిరీష అనే యువతితో వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో శిరీషతో విడాకులు కావాలని సుభాష్‌ కోరాడు. ఈలోపే ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు సుభాష్‌. ఆదివారం పెళ్లి కూడా జరగాలి.

కానీ…మొదటి భార్య శిరీష, ఆమె కుటుంబ సభ్యులు గుత్తి పోలీసులను ఆశ్రయించి, తమకు న్యాయం చేయాలని కోరారు. దాంతో పోలీసులు వెంటనే పెళ్లి మండపానికి వెళ్లి వివాహాన్ని నిలిపేశారు. దాంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా మూటముళ్లె సర్దుకొని వెళ్లిపోయారు. తొలుత పెళ్లి చేసుకున్న అమ్మాయి తనతో 10 రోజులు మాత్రమే ఉందని.. ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండనని తను అభ్యంతరం వ్యక్తం చేసిందని.. అంతే కాకుండా ఇతర వ్యక్తులతో సన్నిహితంగా చాట్ చేసిందని.. ఆ ఆధారాలు పోలీసులకు ఇస్తానని సుభాష్ చెబుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..