AP Rains: ఈదురు గాలులు, ఉరుముల, మెరుపులతో ఏపీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

|

Mar 31, 2023 | 9:12 PM

వచ్చే 3 రోజుల పాటు ఈదురు గాలులతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం.

AP Rains: ఈదురు గాలులు, ఉరుముల, మెరుపులతో ఏపీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Follow us on

మధ్య ఉత్తరప్రదేశ్ & పరిసరాల్లో గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉండి కొనసాగుతున్నది. ఉపరితల ఆవర్తనము నుండి మధ్య ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు తూర్పు మధ్యప్రదేశ్ మరియు విదర్భ మీదుగా మీదుగా ద్రోణి / గాలుల కోత సగటుసముద్ర మట్టం నుండి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో దక్షిణ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

—————————–

శుక్ర, శని, ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
———————–

శుక్ర, శని, ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-
—————-

శుక్ర, శని, ఆదివారం :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి