వాతావరణ సూచన : ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు.. కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులు..

|

Mar 18, 2021 | 4:22 PM

weather report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ శాఖ పలు వివరాలను

వాతావరణ సూచన : ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు.. కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులు..
Weather Report
Follow us on

weather report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ శాఖ పలు వివరాలను తెలియజేసింది. విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో ఉరుములు, మెరుపులు ఉండగా.. ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది.

ఇక తెలంగాణలో.. ఒకవైపు రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో చల్లని వార్తను మోసుకొచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాలు మరియు మారుమూల ప్రాంతాలలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్, కొమరంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాల్లో గురువారం ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షపాతానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మధ్య ప్రదేశ్ వైపు నుండి ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో, ఉత్తర తెలంగాణ, ఉత్తర కర్ణాటక లోని కొన్ని జిల్లాలలో జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితులు రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు ఉండవచ్చునని తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ వరకు తగ్గుతుందని పేర్కొన్నారు.

YS Sharmila : కాళేశ్వరం గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరు తోడుంటే ఎంతటి కొండనైన ఢీ కొట్టేందుకు నేను రెడీ : షర్మిల

Saif Ali Khan in a new look : సైఫ్ అలీఖాన్ న్యూ లుక్.. ‘ఆదిపురుష్’ లో కనిపించేది ఇలానేనా..

Beware of Covid-19 : కరోనా వైరస్‌పై మరో షాకింగ్ న్యూస్.. కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు