AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు( 21 నవంబర్ 2022) భారత కాలమానం ప్రకారం 8 గంటల 30 నిముషాలకు వాయుగుండం ఏర్పడింది. ఇది మచిలీపట్నానికి ఆగ్నేయంగా..

AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Ap Weather Report

Updated on: Nov 21, 2022 | 2:00 PM

నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు( 21 నవంబర్ 2022) భారత కాలమానం ప్రకారం 8 గంటల 30 నిముషాలకు వాయుగుండం ఏర్పడింది. ఇది మచిలీపట్నానికి ఆగ్నేయంగా 550 కి.మీ, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ.వద్ద కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 21 సాయంత్రం వరకు వాయువ్య దిశగా కదిలి అర్ధరాత్రి సమయానికి అదే తీవ్రతను కొనసాగిస్తూ పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత, పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వైపు కదులుతూ ఆ తీర ప్రాంతాల వద్ద క్రమంగా బలహీనపడి నవంబర్ 22వ తేదీ ఉదయానికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని.. రాబోవు మూడు రోజుల వాతావరణ సూచనలు:

ఉత్తరాంధ్ర, యానాం..

ఈ రోజు :

ఇవి కూడా చదవండి

ఉత్తరాంధ్ర జిల్లాలలో, యానాంలోని కొన్నిచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించవచ్చు.

రేపు, ఎల్లుండి :

ఒకటి, రెండు చోట్ల తేలిక పాటి లేదా ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.

దక్షిణాంధ్ర..

ఈ రోజు :

అనేక చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. ఒకటి, రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం సంభవించవచ్చు.

రాయలసీమ..

ఈ రోజు :

అనేక చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. ఒకటి, రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం సంభవించవచ్చు.

రేపు మరియు ఎల్లుండి:

అనేక చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు.