
తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత నెమ్మదించిన నైరుతి రుతుపవనాలకు బూస్టప్ ఇచ్చేలా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. మొన్నటి వరకు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరైన జనాన్ని ఇప్పుడిప్పుడే వానజల్లు పలకరిస్తోంది. నెమ్మదించిన నైరుతికి బూస్టప్ ఇచ్చేలా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘాలతో నిండి ఉంది. నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల పిడుగులు, ఈదురు గాలులతో వానలు కురుస్తాయని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది.
భారీ వర్షంతో కొమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్ పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది. కాగజ్‌గనర్ మండలం అందవెల్లి బ్రిడ్జి తాత్కాలిక రోడ్డు నీట మునిగింది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగజ్‌నగర్-దహెగాం రవాణ వ్యవస్థ పూర్తిగా బ్రేక్ పడినట్లయింది. కాగజ్‌నగర్ అందవెల్లి పెద్దవాగులో ఒకరు గల్లంతయ్యారు. పెద్దవాగు దాటే క్రమంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో సదరు వ్యక్తి నీటిలో కొట్టుకపోయారు. అది గమనించిన కొందరు స్థానికులు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.
ఏపీలోనూ పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. దాంతో.. నంద్యాల జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో వారం రోజులుగా మంచి వర్షాలు లేకుండా పోయాయి. కానీ.. రుతుపవనాలు నెమ్మదించిన తర్వాత బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో.. మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ.
మరిన్ని వాతావరణ సంబందిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..