అసలే పంట చేతికొచ్చే సమయం. రైతులకు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఎండి అంచనా ప్రకారం దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం (22-04-2023) ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం (23-04-2023) ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల వడగాడ్పులు వీస్తున్నారు. ఇలా ఓవైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రంలో.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..