AP Latest Weather Report: వాతావరణ శాఖ హెచ్చరిక.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఉరుముల వర్షాలు

ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈదురుగాలు మూలంగా వరి నేలకొరిగింది. నేలవాలిన వరి దుబ్బులను చూసుకుని రైతులు కన్నీటి పర్యాంతమయ్యారు. అకాల వర్షాల మూలంగా ఇప్పటికే కోలుకోలేని నష్టాల ఊబిలో రైతులు..

AP Latest Weather Report: వాతావరణ శాఖ హెచ్చరిక.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఉరుముల వర్షాలు
AP Latest Weather Report

Updated on: Apr 03, 2023 | 8:44 AM

తెలుగు రాష్ట్రాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులుపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటించింది. గంటకు 30 కిలీమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

కాగా ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కృష్ణా, తూర్పు గోదావరి, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, ప్రకాశం, కాకినాడ, ఎన్టీఆర్‌, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఈదురుగాలు మూలంగా వరి నేలకొరిగింది. నేలవాలిన వరి దుబ్బులను చూసుకుని రైతులు కన్నీటి పర్యాంతమయ్యారు. అకాల వర్షాల మూలంగా ఇప్పటికే కోలుకోలేని నష్టాల ఊబిలో రైతులు కూరుకుపోయారు. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.