Weather Report: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. భారీ వర్షసూచన జారీ.. మూడ్రోజుల పాటు హెచ్చరిక..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. భారీ వర్షసూచన జారీ.. మూడ్రోజుల పాటు హెచ్చరిక..
Rains

Updated on: Sep 25, 2026 | 3:48 PM

దక్షిణ ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, ఈ రోజు సెప్టెంబర్ 25, 2026 ఉదయం 0830 గంటలకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అంతర్గత ఒడిశాపై సుమారు 20.9° ఉత్తర అక్షాంశం, 82.4° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది నువాపడ (ఒడిశా)కు ఉత్తర-వాయువ్యంగా, రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో చంపా (ఛత్తీస్‌గఢ్)కు దక్షిణ-నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలో, బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు దక్షిణంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల పాటు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండం తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత 12 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్యా, నంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకపోవడం మంచిదని అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో భారీ వర్షాలు..

తెలంగాణకు కూడా హైదరాబాద్ వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో పలు ప్రాంతాలకు వర్షసూచన జారీ చేసింది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.  పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశముందని, దీంతో విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ వద్ద నిలబడద్దని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us