AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan Camp Office: తెరపైకి ఫర్నీచర్ రాజకీయం.. మాజీ సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ చుట్టూ రగడ..

ఏపీ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఫర్నిచర్‌ ఫైట్‌ హీట్‌ పెంచుతోంది. ఫర్నీచర్‌ వ్యవహారమే టార్గెట్‌గా టీడీపీ ట్వీట్లు చేయడం.. దానికి వైసీపీ కౌంటర్‌ ఇవ్వడం కాక రేపుతోంది. ఇంతకీ.. ఏంటా ఫర్నీచర్‌ వార్‌? సార్వత్రిక ఎన్నికల హడావుడి అలా ముగిసిందో లేదో.. ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కుతూనే ఉన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే.. మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

YS Jagan Camp Office: తెరపైకి ఫర్నీచర్ రాజకీయం.. మాజీ సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ చుట్టూ రగడ..
Ys Jagan
Srikar T
|

Updated on: Jun 16, 2024 | 7:19 AM

Share

ఏపీ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఫర్నిచర్‌ ఫైట్‌ హీట్‌ పెంచుతోంది. ఫర్నీచర్‌ వ్యవహారమే టార్గెట్‌గా టీడీపీ ట్వీట్లు చేయడం.. దానికి వైసీపీ కౌంటర్‌ ఇవ్వడం కాక రేపుతోంది. ఇంతకీ.. ఏంటా ఫర్నీచర్‌ వార్‌? సార్వత్రిక ఎన్నికల హడావుడి అలా ముగిసిందో లేదో.. ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కుతూనే ఉన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే.. మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్‌ టార్గెట్‌గా టీడీపీ చేసిన ట్వీట్‌ ఒక్కసారిగా కాక రేపింది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్‌కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదని ఆరోపించింది. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌ను సచివాలయ ఫర్నిచర్‌తో నింపేశారని, పదవి పోయిన తర్వాత ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి రిటర్న్‌ ఇవ్వకుండా వాడుకుంటున్నారని పేర్కొంది. జగన్‌ ఇంటికి అల్యూమినియం విండోస్‌, డోర్స్‌, ఫ్యాన్లు, లైట్లు, కరెంట్‌ సామాన్లకు రూ.73 లక్షలు ఖర్చు చేశారని.. ఇంటి రెయిన్‌ ప్రూఫ్‌ పీవీసీ పగోడాస్‌, మొబైల్‌ టాయ్‌లెట్స్‌కి రూ.22.50లక్షలు వినియోగించారంటూ అప్పటి జీవో కాపీలను బహిర్గతం చేసింది టీడీపీ. జగన్‌ ఇంటికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడారని.. ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి ఇచ్చేయాలి.. కదా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు.. త్వరలో అన్నీ బయటకు వస్తాయంటూ మరో ట్వీట్‌ కూడా చేసి.. మరింత హీట్‌ పెంచింది. దాంతో.. జగన్‌ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్‌పై వరుస ట్వీట్లతో టీడీపీ ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది.

ఇక.. టీడీపీ ట్వీట్లు, ఆరోపణలపై వైసీపీ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయింది. టీడీపీ ట్వీట్లకు వివరణ ఇస్తూ కౌంటర్ ట్వీట్లు చేసింది. టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది. రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశంలోని ఫొటోలతో పైశాచిక పోస్టింగులు చేస్తోందని మండిపడింది. మంత్రులు కూడా స్థాయి దిగజారి జగన్‌ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ విమర్శించింది. అటు.. టీడీపీ ట్వీట్లు, ఆ పార్టీ నేతల కామెంట్స్‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం హోదాలో జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. సీఎంగా ఎవరు ఉన్నా.. క్యాంపు ఆఫీస్‌లకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమని గుర్తు చేశారు లేళ్ల అప్పిరెడ్డి. అయితే.. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో ఆ జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగిందని వివరించారు. వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరామన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగానే.. టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా జగన్‌ లక్ష్యంగా దుష్ప్రచారం చేయడం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తుందని మండిపడ్డారు లేళ్ల అప్పిరెడ్డి. మొత్తంగా.. జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌ వ్యవహారం ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో.. టీడీపీ- వైసీపీ మధ్య చెలరేగిన ఫర్నీచర్‌ వివాదం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…