Andhra Pradesh: విశాఖలో వీరంగం.. బూతులతో కామెంట్లు, కౌంటర్లు.. ఎమ్మెల్సీ Vs ఎంపీ బాహాబాహీ..

ఒకరు ఎమ్మెల్సీ.. 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. మరొకరు ఎంపీ.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దించామా లేదా అనేది ఆయన పంచ్. విశాఖ ఈస్ట్‌లో నువ్వానేనా... ఎవరో ఒకరే మిగిలేది.. కొట్టేసుకుందాం రా అంటూ చిటికెలేసి సవాళ్లు విసురుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. మాటలు ముదిరి ఒకరి క్యారెక్టర్లను మరొకరు బైట పెట్టుకునేదాకా వెళ్లింది వ్యవహారం. నువ్వు అరిస్తే అరుపులే నేను అరిస్తే మెరుపులే అంటూ పరస్పర విమర్శలతో విశాఖ రాజకీయాన్ని హీటెక్కించేశారు. ఇంతకీ వీళ్లిద్దరి పగ ఇప్పటిదా.. లేక వేరేమైనా ఫ్లాష్‌బ్యాక్ ఉందా?

Andhra Pradesh: విశాఖలో వీరంగం.. బూతులతో కామెంట్లు, కౌంటర్లు.. ఎమ్మెల్సీ Vs ఎంపీ బాహాబాహీ..
AP Politics

Updated on: Feb 16, 2024 | 5:42 PM

ఒకరు ఎమ్మెల్సీ.. 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. మరొకరు ఎంపీ.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దించామా లేదా అనేది ఆయన పంచ్. విశాఖ ఈస్ట్‌లో నువ్వానేనా… ఎవరో ఒకరే మిగిలేది.. కొట్టేసుకుందాం రా అంటూ చిటికెలేసి సవాళ్లు విసురుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. మాటలు ముదిరి ఒకరి క్యారెక్టర్లను మరొకరు బైట పెట్టుకునేదాకా వెళ్లింది వ్యవహారం. నువ్వు అరిస్తే అరుపులే నేను అరిస్తే మెరుపులే అంటూ పరస్పర విమర్శలతో విశాఖ రాజకీయాన్ని హీటెక్కించేశారు. ఇంతకీ వీళ్లిద్దరి పగ ఇప్పటిదా.. లేక వేరేమైనా ఫ్లాష్‌బ్యాక్ ఉందా?

విశాఖ నడిగడ్డపై కాకరేపుతోంది ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్సీ బిగ్‌ఫైట్‌. ఎంవీవీ అక్రమాలు, భూకబ్జాలను ఆధారాలతో సహా బైటపెడతా, నిన్ను మీ ముఖ్యమంత్రి కూడా కాపాడలేరు.. అంటూ ఎంపీ మీద ఒంటికాలి మీద లేచారు వంశీ. వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ ఇటీవలే జనసేనలో చేరిన వంశీ.. ఎంపీనిని టార్గెట్ చేసి విశాఖ రాజకీయాల్ని కేక పెట్టించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఎమ్మెల్సీ వంశీపై పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. అక్కడితోనే ఆగలేదు.. మీడియా ముందుకొచ్చి మైకు పుచ్చుకుని ఏకిపారేశారు. నేనేదో అక్రమాలు చేశానంటున్నారు.. వాళ్ల ప్రభుత్వం వస్తే ఏదో పీకుతామంటున్నారు అంటూ వెంట్రుక భాష అందుకున్నారు ఎంపీ.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. విజయసాయిరెడ్డి దయతో కార్పొరేటర్ అయ్యాడు.. చెక్‌బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్‌మెంట్లు ఉన్నాయి.. అంటూ వంశీ గురించి ఫ్లాష్‌బ్యాక్ తవ్వారు. నువ్వేంది నా అంతు చూసేది అంటూ గ్లామరస్ పంచ్ ఇవ్వబోయారు ఎంవీవీ.

వంశీ, ఎంవీవీ.. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరిదీ విశాఖ రాజకీయాల్లో ఘరానా నేపథ్యమే. బిజినెస్‌మేన్‌గా ఉంటూ 2009లోనే ప్రజారాజ్యం తరఫున పాలిటిక్స్ మొదలుపెట్టి, 2012లో వైసీపీలో జాయినై వైజాగ్ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. అలియాస్ వంశీ. మళ్లీ పోటీ చేసి వెలగపూడి మీద ఎలాగైనా గెలవాలని పట్టుమీదున్నారు. కానీ.. 2019లో తనకు టికెట్ రాకుండా ఎంవీవీ అడ్డుకున్నారన్నది వంశీ ఆరోపణ.

టీడీపీ నేత కళా వెంకట్రావుతో గొడవ కారణంగా, జైలుకెళ్లి పరాభవంపాలై, కసికొద్దీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన నేపథ్యం ఎంవీవీ సత్యనారాయణది. రాజకీయాల్లోకి లేటుగా వచ్చినా తానే లేటెస్ట్‌ అనేది ఎంపీ ఎవీవీ స్టయిల్. అంతకుముందు పదేళ్లనుంచి పాలిటిక్స్‌లో ఉన్న వంశీ.. 2021లో జీవీఎంసీ ఎలక్షన్స్‌లో కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పదవిని ఆశించారు. కానీ.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ విధంగా బ్యాలెన్స్ చేసింది వైసీపీ అధిష్టానం. కట్‌చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికలు. విశాఖ ఈస్ట్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న సంకల్పంతో హైకమాండ్‌ ఆదేశాల మేరకు ఇన్‌చార్జ్‌గా వచ్చారు ఎంవీవీ. ఎప్పటినుంచో విశాఖ ఈస్ట్‌నే తన అడ్డాగా భావిస్తున్న వంశీకి.. ఎంవీవీ ఎంట్రీ సహజంగానే బాధించింది. అందుకే.. వైసీపీలో ఇమడలేనంటూ చక్కా వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ ఈస్ట్‌ నుంచి ఎంవీవీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవకూడనద్నది వంశీ టార్గెట్.

పొత్తు రాజకీయాల్లో భాగంగా.. పదిహేనేళ్లుగా భీకరమైన శత్రుత్వం ఉన్న వెలగపూడి, వంశీ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసే ప్రెస్‌మీట్ పెట్టడం.. విశాఖ రాజకీయాల్లో ఒక సంచలనం. ఆ సంచలనం నుంచి పుట్టిన మరో సంచలనమే… వంశీ వర్సెస్ ఎంవీవీ అనే తాజా ఎపిసోడ్. టామ్‌ అండ్ జెర్రీల్లా.. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా సాగుతున్న వీళ్లిద్దరి వ్యవహారం.. ఎక్కడ ఎలా తెగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..