Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రయాణికులకు బిగ్ సర్ప్రైజ్.. విశాఖపట్నం-భవానిపట్నం ప్యాసింజర్ ట్రైన్‌లో తొలిసారి అలా…

ట్రైన్ లో సిబ్బంది అంతా మహిళలే కావడంతో కాసేపు అమితాశ్చర్యానికి లోనయ్యారు ప్రయాణికులు అంతా. లోకో పైలట్, కో పైలట్, గార్డ్, టికెట్ కలెక్టర్లు, అటెండెంట్లు, ఇతర సహాయ సిబ్బందినే కాకుండా చివరికి రక్షణ విధులు నిర్వర్తించే భద్రతా దళాలు కూడా మహిళా సిబ్బందే ఉండడంతో ప్రయాణికులు సరికొత్త అనుభూతికి లోనయ్యారు.

Andhra Pradesh: ప్రయాణికులకు బిగ్ సర్ప్రైజ్.. విశాఖపట్నం-భవానిపట్నం ప్యాసింజర్ ట్రైన్‌లో తొలిసారి అలా...
Women Empowerment
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: Mar 09, 2024 | 8:29 AM

విశాఖ పట్నం నుంచి భవానీ పురం బయల్దేరిన ప్రయాణికులకు సరికొత్త అనుభవం ఎదురైంది. ట్రైన్ లో సిబ్బంది అంతా మహిళలే కావడంతో కాసేపు అమితాశ్చర్యానికి లోనయ్యారు ప్రయాణికులు అంతా. లోకో పైలట్, కో పైలట్, గార్డ్, టికెట్ కలెక్టర్లు, అటెండెంట్లు, ఇతర సహాయ సిబ్బందినే కాకుండా చివరికి రక్షణ విధులు నిర్వర్తించే భద్రతా దళాలు కూడా మహిళా సిబ్బందే ఉండడంతో ప్రయాణికులు సరికొత్త అనుభూతికి లోనయ్యారు. పురుషులు ఎవరూ లేకపోయినా ఎలాంటి లోటూ లేకుండా ప్చాసింజర్ రైలును సురక్షితంగా గమ్యస్థానానికి తీసుకెళ్లారు మహిళా సిబ్బంది. దీంతో ప్రయాణికులు కూడా సిబ్బంది మొత్తాన్ని అభినందించారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ నిజంగా సరికొత్త సాహసమే చేసిందని చెప్పాలి. గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు కానీ కనీసం రక్షణ సిబ్బంది అయినా పురుషులు ఉండే వాళ్ళు. కానీ ఈసారి అసలు పురుషులు అనే వాళ్ళే లేకుండా పూర్తి స్థాయిలో మహిళ తోనే నిర్వహించడం విశేషం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని, వాల్టెయిర్ డివిజన్ రైలు నెం.08504 విశాఖపట్నం-భవానిపట్నం ప్యాసింజర్‌ను పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపింది. ఈ మహిళా బృందానికి విశాఖపట్నం స్టేషన్ మేనేజర్ ఎ. అరుణశ్రీ నాయకత్వం వహించారు. లోకో పైలట్‌గా ఝాన్సీరాణి విధులు నిర్వర్తించగా కో-పైలట్‌గా సాధన కుమారి బాధ్యతలు నిర్వర్తించారు. రైలు మేనేజర్‌గా కె శ్రీరమ్య వ్యవహరించారు.

కోచ్ మైంటనన్స్ డిపో నుంచే నిర్వహణ

రైలు బోగీలు విశాఖపట్నం కోచ్ మెయింటెనెన్స్ డిపోలో ఉంటాయి. అక్కడనుంచి పరిశుభ్రంగా బోగీలను ఉంచే బాధ్యత కూడా మహిళా సిబ్బందే తీసుకున్నారు. అనంతరం సంబంధిత తనిఖీల అనంతరం బోగీల నిర్వహణ బృందంతో కలిసి పైలట్ ఝాన్సీ రాణీ ట్రైన్ ను స్టేషన్ ప్లాంట్ ఫామ్ పైకి తీసుకొచ్చారు.

టికెట్ చెకింగ్ స్క్వాడ్‌గా రాణీ ఝాన్సీ

ట్రైన్ లోకో పైలట్‌గా ఝాన్సీ రాణి వ్యవహరించగా, దాదాపు అదే పేరుతో గల మరోక అధికారిని రాణి ఝాన్సీ టికెట్ చెకింగ్ స్క్వాడ్ గా రైలు వెంట వచ్చింది. వీర వనిత ఝాన్సీ రాణి పేర్లు పెట్టుకున్న ఈ ఇద్దరు అధికారులు కీలకంగా వ్యవహరిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చారు. ఇటీవలె రాణీ ఝాన్సీ స్క్వాడ్ అత్యుత్తమ ప్రదర్శనకు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ చేత రైల్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు.

తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ మంజుశ్రీ ప్రసాద్‌తో పాటు ప్రీతి రాణా సీనియర్ డివిజనల్ ఆపరేషనల్ మేనేజర్ విశాఖపట్నం స్టేషన్‌లో రైలు ఆపరేషన్, నిర్వహణ, వాణిజ్య విధులను విజయవంతంగా నిర్వహించినందుకు మొత్తం మహిళా బృందాన్ని సత్కరించారు. తర్వాత రైలుకు పచ్చ జండా ఊపి ట్రాక్‌పై పరుగులు పెట్టించారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…