ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలసలో దారుణం చోటుచేసుకుంది. దొంగల దాడిలో ఒంటరి మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొత్తవలస కుమ్మర వీధిలో నివాసముంటున్న ఒంటరి మహిళపై దొంగలు కారం చల్లి దాడి చేశారు. అనంతరం, దుండగులు మహిళ ఒంటిపైనున్న బంగారం ఎత్తుకెళ్లారు. దాడిలో మహిళకు తీవ్రగాయాలు కాగా.. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కొత్తవలస కుమ్మర వీధిలో సూర్యకాంతం అనే వృద్ధురాలు నివాసముంటోంది. ఈ క్రమంలో ముఖానికి మాస్క్, కళ్లద్దాలు, టోపీ పెట్టుకుని వచ్చిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి కారం చల్లి దాడి చేశారు.. అనంతరం నగలు దొంగతనం చేసి పారిపోయారని స్థానికకులు పేర్కొంటున్నారు.
కాగా, కొత్తవలసలో కొన్నాళ్లుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు.. ఏకంగా దొంగల దాడిలో మహిళ మృతి చెందడంతో.. కొత్తవలస ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
దొంగలు ముఖానికి మాస్క్, టోపీ పెట్టుకుని వచ్చినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..