AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ICAI నిర్వహించే DISA ఫలితాల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం

తెలుగు అమ్మాయి టాప్ లేపింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అసెస్‌మెంట్ టెస్ట్ ఫలితాల్లో ఆలిడింయా టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. గత కొన్నేళ్లుగా జిల్లాలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్‌గా పేరుపొందిన రమ్య… జాతీయ స్థాయి పరీక్షలో అగ్రస్థానం దక్కించుకోవడంతో సహచరులు, సీనియర్ ఆడిటర్లు అభినందనలు కురిపిస్తున్నారు.

Andhra: ICAI నిర్వహించే DISA ఫలితాల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం
Anne Venkata Ramya
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2025 | 10:21 PM

Share

ఐసీఏఐ తాజాగా విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అసెస్‌మెంట్ టెస్ట్ ఫలితాల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటింది. ఆల్‌–ఇండియా ఫస్ట్ ర్యాంక్‌ను విజయనగరం జిల్లాకు చెందిన అన్నే వెంకట రమ్య దక్కించుకుంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ రంగంలో పనిచేయాలనుకునే వారికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ టెస్ట్ ఇది.

విజయనగరం జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రముఖ చార్టడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ తన స్కిల్, పనితనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్య.. ఈసారి జాతీయ స్థాయి పరీక్షలో అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ రంగంలో ఛాలెంజస్ అధిగమిస్తూ, ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంపొందించుకుంటూ వచ్చిన రమ్య సాధించిన ఈ విజయంపై జిల్లాలోని ఆడిటర్లు, సహచరులు, సీనియర్ ప్రొఫెషనల్స్ ఆమెను అభినందిస్తున్నారు.

రమ్య సాధించిన ఆల్‌ ఇండియా ర్యాంక్‌తో విజయనగరం జిల్లా మరోసారి ప్రతిభకు నిలయమని రుజువైంది. ICAI నిర్వహించే అన్ని పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి పరీక్షలో ఈ ఫలితం రమ్య కృషి, పట్టుదల, ప్రొఫెషనల్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. బ్యాంక్ ఆడిట్లలో ఇప్పుడు IS Audit తప్పనిసరి అవుతోంది. దీంతో DISA కలిగిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఐటీతో పాటు ఫైనాన్స్ రంగాల్లో కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ ఆడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్ రంగాల్లో ప్రాధాన్యత ఉంటుంది.

Follow Us
Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..
Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?