Andhra News: విహారం కోసమని బీచ్‌కు వెళ్లిన ఐదుగురు ఫ్రెండ్స్.. నీటిలో దిగిన కాసేపటికే..
విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఋషికొండ ఐటీ హిల్స్ బీచ్‌లో విహారానికి వచ్చిన ముగ్గురు బాలురు అలల ధాటికి సముద్రంలోకి గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీమ్స్ గల్లంతైన బాలురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

విశాఖ తీరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. సరదాగా గడుపుదామని స్నేహితులతో కలిసి రుషి కొండ బీచ్‌కు వచ్చిన ముగ్గురు బాలురు సముద్రంలో గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న ఐదుగురు స్నేహితులు.. నేడు గాంధీ జయంతి సెలవుదినం కావడంతో సరదాగా గడుపుదామని విశాఖలోని రుషి కొండ ఐటీ హిల్స్ బీచ్‌కు వచ్చారు.
కాసేపు అందరూ కలసి బీచ్‌లో సరదాగా గడిపారు. అయితే నీటిలో ఉండగా ఒక్కసారిగా కెరటాలు ఎగిసి పడడడంతో ఐదుగురు బాలురులో ముగ్గురు ఆ కెరటాల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అది గమనించిన మిగతా స్నేహితులు వెంటనే అక్కడనున్న బీచ్ సిబ్బందికి సమాచారం ఇవ్వండంతో వారు, వెంటనే పోలీసులకు రెస్క్యూ సిబ్బందికి విషయం తెలిపారు.
దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది. గల్లంతైన ముగ్గురు బాలుర ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు అయితే ఆ బాలుర ఆచూకీ దొరికనట్టు ఎలాంటి సమాచారం లేదు. సరదాగా గడుపుదామని వచ్చిన తోటి స్నేహితులు సముంద్రంలో గల్లంతవ్వడంతో మిగతా స్నేహితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు బాలుర గల్లంతు విషయం తెలిసిన తల్లిదండ్రులు సైతం ఆందోళనగా ఉన్నారు. తమ పిల్లలను సురక్షితంగా రక్షించి తీసుకురావాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
