
సీబీఐ విచారణకు ముందు ట్విస్ట్ ఇచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో తొలిసారిగా సీబీఐ నిందితుడిగా చేర్చడం.. ఇవాళ ఐదోసారి విచారణకు పిలవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. పిటిషన్ పై లంచ్ మోషన్‌లో విచారణ జరపాలని అభ్యర్థించారు. హైకోర్ట్ నిర్ణయం తర్వాత సీబీఐ విచారణకు హాజరవుతానన్నారు అవినాష్. సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ అవినాష్. వివేకాకు మహిళలతో ఉన్న సంబంధాలే హత్యకు దారితీశాయన్నారు. ఏ2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకాకు సంబంధం ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. మరోవైపు నిందితులతో వివేకా డైమండ్స్ వ్యాపారం చేశారని కూడా పేర్కొన్నారు.
వివేకా కూతురు సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు, సీబీఐ అధికారి కుమ్మక్కయారన్నారు అవినాష్. గూగుల్ టేకౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. దస్తగిరికి డబ్బులిచ్చి అప్రూవర్‌గా మార్చారని .. సీబీఐ కూడా ఆయన స్టేట్‌మెంట్‌కే ప్రాధాన్యమిస్తుందన్నారు. వివేకా తన రెండో భార్యతో ఆర్థిక వ్యవహారాలన్నీ తనతో పంచుకోవడంతో సునీత కక్షగట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు అవినాష్. ఈ అంశాలను పరిగనలోకి తీసుకుని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విఙ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..