Visakhapatnam: విశాఖలో తనకు సెంటు భూమి లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజధాని విశాఖలో అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయండని ఆయన పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మనసున్న మహారాజు అని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో వైయస్సార్ సంస్మరణ సమావేశంలో విజయసాయి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్సార్ సుపరిపాలన అందించారన్నారు. వైయస్సార్ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని విజయసాయి వెల్లడించారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నామని.. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది తమ లక్ష్యమని చెప్పిన విజయసాయి.. ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్సార్ భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో కొలివై ఉన్నారని చెప్పారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు వైయస్ అమలు చేశారన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని కొనియాడారు.
Read also: TRS Flag Day: తెలంగాణ వ్యాప్తంగా గులాబీ గుమగుమలు.. అట్టహాసంగా టీఆర్‌ఎస్ జెండా పండుగ