Vizag RK Beach: జొవాద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చింది. దీంతో బీచ్ వెంబడి భూమి కోతకు గురైంది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు పలు చోట్ల భూమి కుంగిపోయింది. దీని ప్రభావంతో పిల్లల పార్కులోని ప్రహరీ గోడ కూలిపోయింది. బల్లలు విరిగిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్కే బీచ్‌లోకి పర్యాటకులను నిషేధించారు. ఎవరూ రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని మోహరించారు.
ఈ మేరకు అధికారులు పార్కుకు వచ్చే రహదారుల్ని మూసివేశారు. ఎవరిని లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా..జొవాద్ తుఫాను నేపథ్యంలో సముద్రం ముందుకొచ్చి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ తుఫాను ఈ రోజు సాయంత్రానికి ఒడిశాలోని పూరి తీరాన్ని తాకే అవకాశముంది. ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా ఒడిస్సా తీరం వెంబడి ప్రయాణం కొనసాగించి పశ్చిమ బెంగాల్ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Also Read: