Vizag RK Beach: బీచ్ క్లీనింగ్‌లో నిమగ్నమైన యువకులు.. సామాజిక సేవ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..

|

Feb 21, 2023 | 4:27 PM

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో రోజూ ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు స్థానికులు, మరోవైపు పర్యాటకులు.. ఇలా నిత్యం ఆర్కే బీచ్ జనసంద్రంతో నిండి ఉంటుంది. అయితే, ఆర్కే బీచ్‌లో కొంతమంది చెత్తాచెదారం ఏరుతూ కనిపించారు.

Vizag RK Beach: బీచ్ క్లీనింగ్‌లో నిమగ్నమైన యువకులు.. సామాజిక సేవ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
Rk Beach Cleen
Follow us on

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో రోజూ ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు స్థానికులు, మరోవైపు పర్యాటకులు.. ఇలా నిత్యం ఆర్కే బీచ్ జనసంద్రంతో నిండి ఉంటుంది. అయితే, ఆర్కే బీచ్‌లో కొంతమంది చెత్తాచెదారం ఏరుతూ కనిపించారు. వారిలో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బుద్ధిగా, సిన్సియర్ గా తీరంలో పేరుకుపోయిన చెత్తను ఏరిపారేసే కార్యక్రమంలో వీళ్లంతా నిమగ్నమయ్యారు. ఇంకో విషయం ఏంటంటే.. పక్కనే వారిని పర్యవేక్షిస్తూ పోలీసులు కనిపించారు. అయితే, ఏదో సామాజిక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారని.. దగ్గర ఉండి మరీ పర్యవేక్షిస్తున్నారని అనుకున్నారు ఇది చూసిన వాళ్లు.. అయినా.. వాళ్లంతా అంత బుద్ధిగా ఎందుకు చెత్తను ఎందుకు ఏరుతున్నారు..? అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వారు ఎవరో కాదు.. మందు బాబులంట.. వీళ్లంతా రాత్రి ఫుల్లుగా తాగి పోలీసులకు దొరికారు. దీంతో సీన్ రివర్స్ అయింది..

అసలు విషయం తెలిసిన తర్వాత తాగి వాహనం నడిపిన మందుబాబుల కిక్కు వదిలింది.. తిక్క కుదిరిందంటున్నారు స్థానికులు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారందరికీ విశాఖ కోర్టు వినూత్నమైన తీర్పు చెప్పింది. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారందరికీ సామాజిక సేవలో భాగంగా బీచ్ క్లీనింగ్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దీంతో గడచిన మూడు రోజుల్లో పట్టుబడిన 52 మంది ఈరోజు ఆర్కే బీచ్ లో బిజీబిజీగా కనిపించారు. తీరంలో ఉన్న చెత్తను చకచక ఏరి వేతలో నిమయ్యారు.

Vizag Rk Beach

బుద్ధిగా.. బీచ్ లో ఉన్న చెత్తాచెదారం ఏరుతూ కోర్టు ఆదేశాలతో సామాజిక సేవ చేశారు. బుద్ధిగా మూడు గంటల పాటు ఎండలో బీచ్ లో ఉన్న చెత్తను ఏరే కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. గతంలోనూ పలుమార్లు వేర్వేరు సామాజిక కార్యకలాపాలు చేయించాలని పేర్కొన్న కోర్టు.. తాజాగా డ్రంకెన్ డ్రైవర్లకు బీచ్ క్లీనింగ్ చేయించడంపై పలువురు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కోర్టు తీసుకున్న నిర్ణయంతో డ్రంకెన్ డ్రైవర్లకు ప్రాయశ్చితం కలగడంతో పాటు.. మరోవైపు సామాజిక సేవపై అవగాహన కలిగింది. ఇకనుంచి తాగి వాహనం నడిపే ముందు పదిసార్లు ఆలోచన చేసే పరిస్థితి వాళ్లకు ఏర్పడింది. మూడు రోజుల్లో పట్టుబడిన 52 మందికి కోర్టు ఆదేశాలలో బీచ్ క్లీనింగ్ చేయించామని ట్రాఫిక్ ఏడిపి ఆరిఫుల్లా తెలిపారు.

Rk Beach

మరిన్ని ఏపీ వార్తల కోసం..