Watch: అల్లూరిలో టూరిస్టుల సందడి.. రోడ్లపై భారీగా ట్రాఫిక్! వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు..

పచ్చని పందిరి వేసినట్లు చుట్టూ ప్రకృతి అందాలతో కనువిందు చేసే అల్లూరి ఏజెన్సీలో యేటా చలికాలంలో పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. ఈ యేడాది కూడా క్యూ కట్టారు. శనివారం, ఆదివారం వీకెండ్ సెలవులు రావడంతో ప్రస్తుతం అక్కడి రోడ్డన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి..

Watch: అల్లూరిలో టూరిస్టుల సందడి.. రోడ్లపై భారీగా ట్రాఫిక్! వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు..
Wooden Bridge In Alluri District

Updated on: Dec 28, 2025 | 9:27 AM

అల్లూరి, డిసెంబర్‌ 28: అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూల్ క్లయిమేట్ పర్యాటకులను గిలింతలు పెడుతుంది. దీంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. వీకెండ్ కు తోడు వరుస సెలవులు కావడంతో భారీగా రద్దీ నెలకొంది. అరకులోయలో హోటల్ గదులు హౌస్ ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో రద్దీ నెలకొంది. సుంకరిమెట్ట ఉడెన్ బ్రిడ్జ్ కు సందర్శకులు
అమాంతంగా పెరిగారు. ఈ క్రమంలో శనివారం రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈరోజు కూడా భారీగా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలువులు రావడంతో జనాలు అరకు టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు.

మరోవైపు భారీ రద్దీ, ట్రాఫిక్ నేపథ్యంలో వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రకటించింది. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా అనుమతించబోమని తన ప్రకటనలో వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.