జూపల్లికి భారీ షాక్ ఇచ్చిన అధిష్టానం..

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి టీఆర్ఎస్ అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. మునిసిపల్ ఎన్నికల్లో రెబల్‌‌గా గెలిచిన అభ్యర్థులు టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తామని చెప్పినా.. అందుకు టీఆర్ఎస్ తిరస్కరించింది. అంతేకాదు.. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గీయులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా నో చెప్పింది అధిష్టానం. కొల్లాపూర్‌ మునిసిపల్‌లో 20 స్థానాలకు గాను టీఆర్ఎస్ కేవలం తొమ్మిది స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే మునిసిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 12 స్థానాలు కావాలి. అందుకు టీఆర్ఎస్ మూడు […]

జూపల్లికి భారీ షాక్ ఇచ్చిన అధిష్టానం..
Follow us

| Edited By:

Updated on: Jan 26, 2020 | 2:25 PM

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి టీఆర్ఎస్ అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. మునిసిపల్ ఎన్నికల్లో రెబల్‌‌గా గెలిచిన అభ్యర్థులు టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తామని చెప్పినా.. అందుకు టీఆర్ఎస్ తిరస్కరించింది. అంతేకాదు.. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గీయులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా నో చెప్పింది అధిష్టానం. కొల్లాపూర్‌ మునిసిపల్‌లో 20 స్థానాలకు గాను టీఆర్ఎస్ కేవలం తొమ్మిది స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే మునిసిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 12 స్థానాలు కావాలి. అందుకు టీఆర్ఎస్ మూడు స్థానాల దూరంలో ఉండగా.. జూపల్లి అనుచరులు 11 స్థానాలను గెలిచారు. అయితే ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లతో.. కొల్లాపూర్ మునిసిపల్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. కాగా, ఇప్పటికే గెలిచిన తొమ్మిది మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను క్యాంప్‌కి తరలించింది అధిష్టానం.