అక్టోబర్‌ నుంచి ఏపీలో వందశాతం ఆర్టీసీ బస్సులు..!

అక్టోబర్ నుంచి ఏపీలో అన్ని బస్సు సర్వీసులు రోడెక్కనున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 21 నుంచి మే 20 వరకు ప్రభుత్వం

అక్టోబర్‌ నుంచి ఏపీలో వందశాతం ఆర్టీసీ బస్సులు..!

Edited By:

Updated on: Sep 28, 2020 | 8:59 AM

APSRTC services News: అక్టోబర్ నుంచి ఏపీలో అన్ని బస్సు సర్వీసులు రోడెక్కనున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 21 నుంచి మే 20 వరకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. ఇక మే 21నుంచి ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో 30శాతం మించి బస్సులను నడపలేదు. అంతేకాదు ఆ బస్సుల్లోనూ సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ.. 50 శాతం సీట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి భారీ నష్టం కూడా వాటిల్లింది.

ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో అక్టోబర్‌ నుంచి అన్ని ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే 100శాతం సీట్లతో బస్సులను నడపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అందుకు తగ్గ పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో తొలగించిన సీట్లను సరిచేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా డిపోలకు చెందిన గ్యారేజ్‌ మెకానిక్స్‌ తొలగించిన సీట్లను జోరుగా భర్తీ చేస్తున్నారు.

Read More:

Bigg Boss 4: ప్రశ్నించినందుకే దేవి ఎలిమినేట్ అయ్యిందా..!

Bigg Boss 4: పాజిటివ్ బిగ్‌బాస్‌.. ఆమెను సేవ్ చేసిన దేవి