Breaking News
  • కర్నూలు : శ్రీశైలం డ్యాం గేట్ల కింద ఏర్పడిన భారీ గొయ్యి (ప్లుంజ్ పూల్) మరింత ప్రమాదకరంగా విస్తరిస్తున్న ట్లు నిపుణుల కమిటీ హెచ్చరిక. గొయ్యి డ్యాం లోపలికి విస్తరించే అవకాశం ఉన్నట్లు హెచ్చరించిన కమిటీ. అలా జరిగితే డ్యాం కు ప్రమాదం పొంచి ఉన్నట్లే అని హెచ్చరిక. ప్లంజ్ పూల్ ఏ స్థాయిలో ఉంది అనేదానిపై ఇప్పటికే వాటర్ ప్రూఫ్ వీడియో కెమెరాలతో పరిశీలించిన నిపుణులు. 6,8 గేట్ల వద్ద భారీ గుంతలు ఏర్పడి ఇ అవి మరింత పెద్దవి అవుతున్నట్లు గుర్తించిన కమిటీ. గొయ్యి వంద మీటర్ల లోతు వరకు ఉన్నట్లు అంచనా వేసిన నిపుణులు. 2002 సంవత్సరంలో వేసిన కాంక్రీట్ కూడా ఫోర్స్ కు నిలువలేక లేచి పోయినట్లు గుర్తింపు. రివర్ స్లూయిస్ లలో లీకేజీ ఉన్నట్లు గుర్తింపు. అతి భారీ వరదలు వచ్చినప్పుడు వరదలు మళ్ళించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూడాలని సూచన. మొత్తం మరమ్మతులకు 900 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని సూచన. శ్రీశైలం డ్యాం రెండు రాష్ట్రాలకు సంబంధించినది కాబట్టి ఖర్చు కూడా ఇరు రాష్ట్రాలు భరించాలని కేంద్ర జల శక్తి మంత్రికి ఇటీవలే లేఖ రాసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2009లో శ్రీశైలం డ్యాం కు 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది అంతకంటే ఎక్కువ వస్తే ఏమి చేయాలి అనే దానిపై కూడా ప్లాన్ తయారు చేయాలి అని సూచన. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏపీ పాండ్య కమిటీ చైర్మన్ గా.... నీటిపారుదల శాఖ నిపుణులు రాజగోపాలన్,yk కంద, pr రావు, రౌతు సూర్యనారాయణ, సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ ఏడాది మార్చి 5 6 7 తేదీలలో శ్రీశైలం డ్యామ్ పరిశీలన.
  • జాతీయం : (హెల్త్ బులిటెన్ - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ) . భారత్ లో కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ . 80 లక్షల 88 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. .గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 563 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 57,386 .దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851 .దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,94,386 .“కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 73,73,375 . “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,21,090 . దేశంలో 91.15 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.35 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు . గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 11,64,648 . ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,77,28,088.
  • నాచారం పీఎస్ పరిధిలో కన్న బిడ్డను పోషించలేక అమ్ముకున్న తల్లి, దండ్రులు . 5 నెలల తరువాత తన బిడ్డను తనకు ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించిన తల్లి . మీనా, వెంకటేష్ లకు జులై లో 19 న బిడ్డ పుట్టగానే మధ్యవర్తి ద్వారా వేరొకరికి అమ్మిన వైనం . కాప్రా సర్కిల్ లో సూపర్ వైజర్ పనిచేస్తున్న రాజేష్ అనే వ్యక్తి తన భార్య గా బాధితురాలు మీనాను ESI హాస్పిటల్ లో డెలివెరి చేపించి అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకున్న వైనం . ESI హాస్పిటల్ సాక్షిగా బిడ్డ అమ్మకం . తన కొడుకు తనకి కావాలంటూ 5నెలల తరువాత పోలీసులను ఆశ్రయించిన మీనా దంపతులు . నాకు పుట్టింది ఆడపిల్ల అనిచెప్పి, మోసం చేసి మగబిడ్డను మధ్యవర్తి అమ్మేశారని బాధితురాలు ఆవేదన . కేసు నమోదు చేసుకొని బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన పోలీసులు.
  • చెన్నై: నటుడు రజినీకాంత్ ఆరోగ్యం ఫై, పార్టీ ఫై వస్తున్న ప్రచారాలపై ప్రకటన విడుదల చేసిన రజినీకాంత్ . నా ఆరోగ్యం ఫై సోషల్ మీడియా లో జరుగుతున్న వివాదం లో నిజం లేదు. నేను డాక్టర్లను కలిసిన మాట నిజమే . నా ప్రస్తుత ఆరోగ్యం ఫై వారి సలహాలు , సూచనలు తీసుకున్నాను . ఇప్పుడు రాజకీయాలు వద్దని , నా ఆరోగ్యం నిలకడగా ఉండాలంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని వస్తున్న వార్తలపై త్వరలోనే వివరణ ఇస్తాను. నేను పార్టీ పెట్టడం ఫై , నా రాజకీయ ఆలోచనల గురించి నా అభిమానులకు నేను పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
  • అమరావతి: విశాఖ గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేతపై అప్పీల్ కు వెళ్లిన గీతం యాజమాన్యం. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు. వచ్చే సోమవారం రెగ్యులర్ కోర్టులో విచారణకి వాయిదా వేసిన న్యాయస్థానం. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న హైకోర్టు.
  • బిగ్ బాస్‌ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్‌. నాగార్జున కోరితేనే షో చేశానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సామ్‌. 'గతంలో ఒక్క బిగ్‌ బాస్‌ ఎపిసోడ్ కూడా చూడలేదు. యాంకరింగ్ చేసిన అనుభవం కూడా లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో. అందుకే మామగారు బిగ్‌ బాస్‌ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను. అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు అందుతున్న ప్రేమకు మీ అందరికీ కూడా థ్యాంక్స్‌'.
  • టిఎస్ ఎంసెట్లో 45 శాతం మార్కుల నిబంధన తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. TSEAMCET-2020 లో అర్హత సాధించిన విద్యార్థులను TS EAMCET (అడ్మిషన్స్) -2020 కౌన్సెలింగ్ కు హాజరుకావడానికి అనుమతి. 10 + 2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు TS EAMCET-2020 లో అడ్డంకిగా మారిన 45 శాతం మార్కుల నిబంధన. ఈ నిబంధన 2020- 21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తింపు. భవిష్యత్తులో 2021-22 సంవత్సరానికి ఈ నిబంధన వర్తించదు. శ్రీమతి చిత్రా రామచంద్రన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్.

Bigg Boss 4: ప్రశ్నించినందుకే దేవి ఎలిమినేట్ అయ్యిందా..!

బిగ్‌బాస్‌ మూడో వారంలో ఎలమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది దేవి. హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి అందరికీ గట్టి పోటీ ఇచ్చిన దేవి

Devi eliminates Bigg Boss 4, Bigg Boss 4: ప్రశ్నించినందుకే దేవి ఎలిమినేట్ అయ్యిందా..!

Devi eliminates Bigg Boss 4: బిగ్‌బాస్‌ మూడో వారంలో ఎలమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది దేవి. హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి అందరికీ గట్టి పోటీ ఇచ్చిన దేవి, అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఇది నిజంగా వీక్షకులకు షాక్‌ కలిగించే విషయమే. ఎందుకంటే ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దీంతో అసలు దేవి ఎందుకు ఎలిమినేట్ అయ్యిందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. కొందరిలా సేఫ్‌ గేమ్ ఆడకుండా.. ప్రశ్నించినందుకే ఇలా ఎలిమినేట్ చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే మొదటిసారి ఎలిమినేషన్‌ కోసం నామినేట్ అయినప్పటి నుంచి తనను సపరేట్‌గా చూస్తున్నారంటూ దేవి పలుమార్లు చెప్పుకొచ్చింది. ఈ విషయంపై నాగార్జున ముందే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. కాగా హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి దేవి తన పంథాలోనే ఉంది. అవసరం ఉన్నప్పుడే నవ్వేది, నవ్వించేది. ఆడేటప్పుడు సీరియస్‌గా ఆడేది. కొంతమంది కంటెస్టెంట్‌లా ఏదో హాట్ టాపిక్‌గా మారాలని ఆమె ఎప్పుడూ ప్రవర్తించలేదు. అంతేకాదు కావాలని గొడవ పెట్టుకున్న సందర్భాలు లేవు. అలాగే తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్పేది. ఎవరి మెప్పు పొందాలని తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. ఎవరి మధ్య పుల్లలు పెట్టలేదు. ఇలా దేవిలో చాలా పాజిటివ్‌లే ఉన్నాయి.

అయితే నామినేషన్‌లో రాజశేఖర్ మాస్టర్‌ మెడను పట్టుకొని నెట్టడం, ఆయన బోరుగా ఏడ్చడంతో దేవిపై కాస్త నెగిటివ్‌గా మారింది. ఆ టాస్క్ ఇచ్చింది బిగ్‌బాస్ అయినప్పటికీ.. ఎఫెక్ట్ మాత్రం దేవిపై పడింది. ఇక తప్పు చేయనప్పుడు సారీ చెప్పేందుకు దేవి ఒప్పులేదు. ఇది కొంతమందికి తప్పుగా కనిపిచ్చి ఉండొచ్చు. ఇక గేమ్‌ల గురించి ఈ పిచ్చి గేమ్‌లు ఏంటంటూ దేవి మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆమెను కరాటే కళ్యాణి చేత డైరెక్ట్ నామినేట్ చేయించి ఎలిమినేట్ చేశారని దేవికి మద్దతు ఇచ్చే వారు అంటున్నారు. హౌజ్‌లో కొనసాగాలంటే ఎవరితోనైనా అఫైర్ నడిపించాలి. లేదంటే పులిహోర కలపాలి. అలా కాకుండా గేమ్ గేమ్ అంటూ సీరియస్‌గా ఉండే దేవిలాంటి వాళ్లను బయటకు పంపిస్తారంటూ వారు మండిపడుతున్నారు.

Read More:

Bigg Boss 4: పాజిటివ్ బిగ్‌బాస్‌.. ఆమెను సేవ్ చేసిన దేవి

Bigg Boss 4: ఊహించని షాక్‌.. ఎలిమినేట్ అయిన దేవి

Related Tags