ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం సృష్టిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో పెద్ద పులి మరో సారి కనిపించింది. పవర్ ప్లాంటు పరిసరాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లుగా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. నిన్నటి నుంచి ప్లాంట్ ఏరియాలోనే పులి సంచరించినట్లుగా గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. గ్రౌండ్ లెవల్‌లో పనులను నిలిపివేసి కార్మికులను అప్రమత్తం చేశారు. అనంతరం పులి కదలికలపై అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.