జీహెచ్‌ఎంసీలో పదోతరగతి పరీక్షలు వాయిదా.. హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా వేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జీహెచ్‌ఎంసీలో పదోతరగతి పరీక్షలు వాయిదా.. హైకోర్టు సంచలన తీర్పు
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 5:52 PM

తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా వేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని సూచించింది. అంతేకాదు సప్లిమెంటరీ ఉత్వీర్ణులను కూడా రెగ్యులర్‌గానే గుర్తించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించింది.

కాగా ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5వ తేది వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9. 30 నుంచి 12.15 నిమిషాల వరకు పరీక్షలు జరగనుండగా.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల గ్యాప్ ఉండబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఒక్కో బెంచ్‌కి ఒక్కో విద్యార్థి మాత్రమే కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి కేంద్రంలో శానిటైజర్లు, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. అలాగే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రాయబోయే విద్యార్థులకు కూడా అధికారులు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యార్థులందరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

Read This Story Also: జక్కన్న మాటలను కీర్తిస్తూ ట్వీట్ చేసిన రష్యా ఎంబసీ..!