AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొత్తరకం వైరస్…మూగజీవాల మృత్యువాత

తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శింస్తోంది. గత 15-20 రోజులుగా.. రోజుకూ వందకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. పైగా జిల్లాలు గ్రామాలకు కూడా వైరస్ విస్తరించటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త రకం వైరస్ కలవరపెడుతోంది.

తెలంగాణలో కొత్తరకం వైరస్...మూగజీవాల మృత్యువాత
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2020 | 6:03 PM

Share

తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శింస్తోంది. గత 15-20 రోజులుగా.. రోజుకూ వందకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. పైగా జిల్లాలు గ్రామాలకు కూడా వైరస్ విస్తరించటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త రకం వైరస్ కలవరపెడుతోంది. వనపర్తి జిల్లాలో కొత్త రకం వైరస్ ఒకటి జనాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇది మూగజీవాలను పొట్టన పెట్టుకుంటోంది. పూర్తి వివరాలు పరిశీలించగా…

వనపర్తి జిల్లా వాసుల్ని కొత్త రకం వైరస్ వణికిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం వనపర్తి జిల్లాలోని మదనాపురం మండలంలో వైరస్ కారణంగా వారం రోజుల వ్యవధిలోనే రూ. లక్షలు విలువచేసే ఏడు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. అంతేకాకుండా.., జిల్లాలో మరికొన్ని పశువులు ఈ వైరస్ బారిన పడి గత 20 గంటలుగా మృత్యువుతో పోరాడుతున్నాయి. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో పశువులకు సంక్రమిస్తున్న ఈ వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వైరస్ కేవలం తెలుపు రంగులో ఉన్న పశువులకు మాత్రమే సోకుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే, ఇటీవలే ఈ వైరస్ ప్రభావంపై రాష్ట్ర స్థాయిలో పశు సంవర్థకశాఖ అధికారులు జిల్లాలో పర్యటించారు.

పశువుల్ని పట్టిపీడిస్తున్న వైరస్‌పై పరిశోధనలు జరిపిన అనంతరం.. ఈ వైరస్‌ లంపి స్కిన్‌గా పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ధారించారు. దీనికి గురైన పశువులకు ఒళ్లంతా తీవ్రమైన దద్దుర్లు ఏర్పడతాయని చెప్పారు. తీవ్రత మరింత పెరిగితే పశువులు చనిపోతాయని చెప్పారు. కౌ ఫాక్స్‌ తరహాలోని ఈ వైరస్‌ సోకిన పశువుల్లో వంటిపై దద్దుర్లు, గొంతువాపు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడిన పశువుల నివేదిక రూపొందించారు. ఇప్పటిదాకా లంపి స్కిన్‌ వైరస్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 మూగ జీవాలకు సోకినట్లు అంచనా వేశారు. ఈ విషయంపై ఇదివరకే జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని, వారు  జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పశువుల నుంచి రక్తం, మలమూత్రాలు, రక్తంతో పాటు లాలాజలం నమూనాలు సేకరించినట్లు స్థానిక పశు వైద్యాధికారులు తెలిపారు.  మృతి చెందిన పశువుకు పోస్టుమార్టం కూడా నిర్వహించారు. లంపి స్కిన్ వైరస్‌కు మందు లేదని అధికారులు చెప్పారు. లక్షణాలు తగ్గించే మందులు వాడుతూ పశువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.