ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తెలంగాణ చరిత్రలో 1కోటి12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన ఏడాది 2014-15లో వానాకాలం, యాసంగిలో కలిపి కేవలం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ఈ ఏడాది కోటి 12 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
2019-20 ఏడాదిలో చరిత్రలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. వానాకాలంలో 47 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. గత యాసంగి కంటే ఈ ఏడాదిలో 76 శాతం మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేసినట్లుగా తెలిపారు.