AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు!

మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఓ ప్రభుత్వ ఉద్యోగిని మూతి పళ్ళు రాలగొట్టిన ఘటన పుల్లంపేటలో చోటు చేసుకుంది. పుల్లంపేటలో మద్యం సేవించి ఆటోతో స్కూటర్ ను ఢీకొన్న ముగ్గురు యువకులను మందలించిన వీఆర్వో సుబ్బరాయుడు పై ముగ్గురు యువకులు దాడి చేసి విచక్షణ రహితంగా మూతి పళ్ళు రాల గొట్టి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే..

Watch Video: ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు!
Drunken Youths Attacked On Kadapa Vro
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Apr 30, 2026 | 4:21 PM

Share

కడప, ఏప్రిల్‌ 30: కడప జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రం విఆర్వో సుబ్బరాయుడుపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన మూడు మూతి పళ్ళు రాలి పోయాయి. VRO భోజనం ముగించుకుని కార్యాలయం బయట రోడ్డు పక్కన స్కూటర్ ను ఆపి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ సమయంలో కొందరు యువకులు మద్యం సేవించి ఆటోతో విఆర్వో సుబ్బ రాయుడు స్కూటర్ ను ఢీ కొన్నారు.

దీంతో ఆగ్రహించిన సుబ్బ రాయుడు ఏరా తాగి ఉన్నారా? అని మందలించాడు. మత్తులో ఉన్న యువకులు విఆర్వో సుబ్బరాయుడు పైదాడి చేశారు. ఈ దాడిలో విఆర్వో సుబ్బరాయుడు మూడు మూతి పళ్ళు రాలిపోవడంతో పాటు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us