సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. రైలు నెం. 20834 సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం నాడు(ఈరోజు) 15.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరాల్సి ఉండగా.. షెడ్యూల్ మారింది. ఇదే రోజు అంటే, 07-04-2023 సాయంత్రం 18.15 గంటలకు బయలుదేరేలా రీషెడ్యూల్ చేయడం జరిగింది. ప్రయాణికులు రీషెడ్యూల్‌ను గమనించాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కాగా, బుధవారం నాడు కూడా విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య వెళ్లనున్న వందే భారత్ రైల్ టైమింగ్స్‌లో మార్పులు చోటు చేసుకుంది. ఉదయం 5.45 గంటలకు బదులు విశాఖలో ట్రైన్ ఉదయం 9.45 గంటలకు బయలుదేరింది. ఖమ్మం-విజయవాడ సెక్షన్ మధ్య కొందరు దుండగులు వందే భారత్ రైలు పై రాళ్ల దాడి చేశారు. దాంతో రైలు S8 కోచ్ గ్లాస్ పగిలిపోయింది. కొత్త గ్లాస్ అమర్చిన తరువాత ట్రైన్ బయలుదేరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..