AP News: ఏవోబిలో హై అలర్ట్..! నివురుగప్పిన నిప్పులా మన్యం

| Edited By: Ram Naramaneni

Jul 28, 2023 | 9:19 AM

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు నివురుగాపిన నిప్పుల మారింది. ఒకవైపు అమరవీరుల వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిస్తే.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. భారీగా బలగాలను రంగాల్లోకి దించారు.

AP News: ఏవోబిలో హై అలర్ట్..!  నివురుగప్పిన నిప్పులా మన్యం
Ap Police Check Point
Follow us on

విశాఖపట్నం, జులై 28: అవి ఒకప్పుడు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు.. ఆయా గ్రామాల్లో మావోయిస్టు సానుభూతిపరులు కూడా ఉండేవారు. అక్కడికి అధికారులు ఎవరైనా వెళ్లాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకునేవారు. కానీ.. ఇప్పుడు అక్కడే మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కనిపిస్తున్నాయి. అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలయితే.. వారోత్సవాలు మాకెందుకు..? అంటూ ఏజెన్సీలో పోస్టర్లు కరపత్రాలు దర్శనమివ్వడం ఇప్పుడూ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు వారోత్సవాల సమయంలో అల్లూరి అభివృద్ధి సమితి పేరుతో వ్యతిరేక పోస్టర్లు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి.

నివురు గప్పిన నిప్పు..

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు నివురుగాపిన నిప్పుల మారింది. ఒకవైపు అమరవీరుల వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిస్తే.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. భారీగా బలగాలను రంగాల్లోకి దించారు. గతంలో మావోయిస్టుల ప్రభావం ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ.. వ్యూహ ప్రతి వ్యూహాలతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అయితే ఒకింత కనిపిస్తోంది. నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఏఓబిలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఏజెన్సీని జల్లెడ పడుతున్నయి బలగాలు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఏజెన్సీలోని వారపు సంతలపై నిఘా పెట్టారు. జి మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, జీకే వీధి చింతపల్లి మండలాలతో పాటు ఏఓబి రోడ్లలో నిఘా పెంచాయి బలగాలు. కూబింగ్‌ను ముమ్మరం చేశాయి. మావోయిస్టు పార్టీ ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఇటీవల లేక విడుదలైన నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు. ఏజెన్సీలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. ప్రధానంగా ఒడిస్సా వైపు నుంచి వచ్చే రోడ్లపై ప్రత్యేక నిఘా పెంచారు. గతంలో కంటే మావోయిస్టుల కదలికలు ఏఓబిలో తగ్గినట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు భయపడే అధికారులు.. ఇప్పుడు ఆయా గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో మమేకమవుతున్నారు. అయినప్పటికీ.. ఏ సమయంలోనైనా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు లేకపోలేదని నిఘా వర్గాల ద్వారా హెచ్చరికలు కూడా పోలీసులకు ఉన్నాయి. దీంతో వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు.

ఆ పోస్టర్లలో..

– మరోవైపు.. మావోయిస్టు వారోత్సవాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలో పోస్టర్లు వెలిశాయి. జి మాడుగుల మండలం నుర్మతి, మద్దిగరువు, చింతపల్లి, జికే విదే, సీలేరు ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు దర్శనమిచ్చాయి. ‘మావోయిస్టు వారోత్సవాలు వల్ల గిరిజనులకు ఒరిగేది లేదు.. వారోత్సవాలు వద్దు…అభివృద్ధి ముద్దు.. గిరిజనులను చంపి వారోత్సవాలు జరుపుకుంటారా..?! మాకు ఉపయోగపడే సెల్ టవర్లను పేల్చి వరోత్సవాలు జరుపుకుంటారు గ్రామాలకు రోడ్లు వేసే యంత్రాలు తగలబట్టి అభివృద్ధిని అడ్డుకొని వారోత్సవాలు చేసుకుంటారా..?!’అంటూ పోస్టర్లలో నినాదాలు కనిపించాయి.

ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు..

– మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాడేరు ఏజెన్సీలో మూడు సర్వీసులు నిలిపివేసింది ఆర్టిసి. మరో ఐదు సర్వీసులను కుదించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.