Pawan Kalyan: సాగర తీరంలో హైటెన్షన్‌.. విశాఖ విడిచి వెళ్లాలని పవన్‌కు పోలీసుల నోటీసులు.. జనసేనాని స్పందనపై సర్వత్రా ఉత్కంఠ

|

Oct 16, 2022 | 2:04 PM

వైజాగ్‌ వెస్ట్‌ జోన్‌ లిమిట్స్‌లో ఉన్న వైజాగ్‌ ఎయిర్‌పోర్టు దగ్గర.. జనసేన కార్యకకర్తలు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు తమ నోటీసులో తెలిపారు పోలీసులు. జనసైనికుల చర్యలతో పలువురికి గాయాలైనట్టు చెప్పారు. జనసేనానితో పాటు పార్టీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు.

Pawan Kalyan: సాగర తీరంలో హైటెన్షన్‌.. విశాఖ విడిచి వెళ్లాలని పవన్‌కు పోలీసుల నోటీసులు.. జనసేనాని స్పందనపై సర్వత్రా ఉత్కంఠ
Pawan Kalyan
Follow us on

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు.. విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రెస్‌ మీట్‌లోనే ఉండగానే అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు… సెక్షన్‌ 30 ప్రకారం నోటీసులు అందజేశారు. వైజాగ్‌ వెస్ట్‌ జోన్‌ లిమిట్స్‌లో ఉన్న వైజాగ్‌ ఎయిర్‌పోర్టు దగ్గర.. జనసేన కార్యకకర్తలు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు తమ నోటీసులో తెలిపారు పోలీసులు. జనసైనికుల చర్యలతో పలువురికి గాయాలైనట్టు చెప్పారు. జనసేనానితో పాటు పార్టీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. విశాఖ పరిధిలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటల లోపుగా విశాఖపట్టణం వదిలి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌. ప్రజల కోసం నిలబడితే.. పోలీసు నోటీసుల రూపంలో అవార్డు దక్కిందన్నారు. రిషికొండలో చేసిన విధ్వంసాన్ని ప్రజలకు చూపకుండా డ్రోన్లను కూడా నిషేధించారన్నారు. ప్రజలకోసం జైలు కెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే పోలీసుల నోటీసులపై పవన్ కల్యాణ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

కాగా అంతకుముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేనాని. అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ నాయకులను విడుదల చేసేంతవరకు జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తామన్నారు. తమ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడంపై ప్రత్యక్ష్యంగా ఉద్యమిస్తామని, ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించుకోవాలన్నారు. పోలీసులు తమను రెచ్చగొడుతున్నారని పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. మరి పోలీసు నోటీసులపై జన సేనాని ఎలా స్పందిస్తారో, తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హోటల్ నుంచి బయటికొస్తే పవన్ ను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి


మరిన్ని ఏపీ వార్తల కోసం  క్లిక్ చేయండి..