Viral News: మందు బాటిళ్లు, నాగిని డ్యాన్సులతో పోలీసులు హల్‌చల్.. వీడియో వైరల్..!
పోలీసులు డ్యాన్స్ చేస్తోన్న మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నాలుగు రోజుల క్రితం షాద్‌నగర్ పోలీసులు చేసిన డ్యాన్స్ వీడియో మరిచిపోకముందే.
Viral News: పోలీసులు డ్యాన్స్ చేస్తోన్న మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నాలుగు రోజుల క్రితం షాద్‌నగర్ పోలీసులు చేసిన డ్యాన్స్ వీడియో మరిచిపోకముందే… మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. తాగిన మత్తులో నాగిని డ్యాన్స్ చేసి హంగామా చేశారు కొందరు అధికారులు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్క్‌లు వేసుకున్నా వైరస్ వస్తుందట.. ఎలాగంటే..!
బహిరంగ ప్రదేశంలో పోలీసులు చేసిన ఈ డ్యాన్స్‌లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మందు తాగితే వారిని పట్టుకెళ్లి న్యూసెన్స్ కేసు బుక్ చేసే పోలీసులు.. ఇలా చేస్తే ఎవరూ పట్టించుకోరా అంటూ మండిపడుతున్నారు. మరి ఈ వీడియోపై పోలీస్ బాసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.