Vaindam Prashanth : పాకిస్తాన్ చెర నుంచి నాలుగేళ్ల తర్వాత ఆంధ్రాకు..! లవర్ కోసం వెళ్లి చిక్కుల్లో పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

|

Jun 01, 2021 | 9:28 AM

Vaindam Prashanth : నాలుగేళ్ల క్రితం పాకిస్తాన్‌ పట్టుబడిన ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వైందాం ప్రశాంత్‌ను ఎట్టకేలకు

Vaindam Prashanth : పాకిస్తాన్ చెర నుంచి నాలుగేళ్ల తర్వాత ఆంధ్రాకు..! లవర్ కోసం వెళ్లి చిక్కుల్లో పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
Vaindam Prashanth
Follow us on

Vaindam Prashanth : నాలుగేళ్ల క్రితం పాకిస్తాన్‌ పట్టుబడిన ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వైందాం ప్రశాంత్‌ను ఎట్టకేలకు ఇండియాకు రప్పించారు. పాకిస్థాన్ రేంజర్స్ బిఎస్ఎఫ్ ద్వారా అత్తారి భూ సరిహద్దు నుంచి ఇండియాలో అడుగుపెట్టాడు. విశాఖ పట్నం నుంచి ప్రశాంత్ తల్లిదండ్రలు మాట్లాడుతూ తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారతప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ప్రేమలో విఫలమై తన ప్రేయసిని వెతుక్కుంటూ స్విట్జర్లాండ్ వెళ్లేక్రమంలో పాకిస్థాన్ లో ప్రవేశించినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అతడికి వీసాలేదు. దీంతో పాకిస్తాన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఖైదు చేశారు. ప్రశాంత్ గూఢాచారి కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడి దగ్గర సరైన ఆధారాలు లభించక జైల్లో పెట్టారు.

ప్రశాంత్ తప్పిపోయిన తర్వాత మాథపూర్ పోలీస్ స్టేషన్లో అతడి తండ్రి ఫిర్యాదు చేశాడు. అయితే ప్రశాంత్ అక్రమంగా పాకిస్తాన్లోకి ప్రవేశించాడని, పట్టుబడ్డాడని మీడియా నివేదికల నుంచి తెలుసుకున్నారు. అనంతరం కొడుకును స్వదేశానికి రప్పించడానికి విదేశాంగ మంత్రిని కలిసి తనగోడును వెళ్లబోసుకున్నాడు. ప్రశాంత్‌ని ఎలాగైనా భారత్‌కు తీసుకువస్తామని చెప్పడంతో అప్పటి నుంచి అతడి తల్లిదండ్రులు ప్రశాంత రాకకోసం ఎదురుచూస్తున్నారు.

Actress Chandini Case: మూడుసార్లు అబార్షన్.. నగ్న ఫొటోలతో బెదిరింపులు..! నటి చాందిని కేసులో ఎమ్మెల్యే ఆగడాలు..

మెట్రో ప్రయాణికులకు ముఖ్య సూచన.. ఈ రోజు నుంచి రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్

Horoscope June: ఈ రాశి వారు ఈ నెల‌లో ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. జూన్‌లో మీ రాశిఫ‌లం ఎలా ఉందో చూసుకోండి..

RBI clears on Cryptocurrency: క్రిప్టో క‌రెన్సీ ఇన్వెస్ట‌ర్ల‌కు RBI గుడ్ న్యూస్..! ఆర్థిక సంస్థ‌లకు సూచనలు..