AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IOCLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఏకంగా రూ.1.60 లక్షలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీర్లు, అధికారులు, లా ఆఫీసర్లు, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు, జూనియర్ ఇంజినీర్లు, జూనియర్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..

IOCLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఏకంగా రూ.1.60 లక్షలు
IOCL Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 24, 2026 | 5:13 PM

Share

కేంద్ర ప్రభుత్వ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశవ్యాప్తంగా పలు ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి ఉన్న భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతూ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, లా, కెమిస్ట్రీ, డిప్లొమా విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశం.

గ్రేడ్-ఎ ఇంజినీర్/ ఆఫీసర్ పోస్టులు

గ్రేడ్-ఎ ఇంజినీర్/ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు, ఎంబీఏ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కెమికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మార్కెటింగ్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ముందస్తు వర్క్‌ అనుభవం అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు వేతనం లభిస్తుంది.

లా ఆఫీసర్లకు అవకాశం

న్యాయశాస్త్రంలో అర్హత ఉన్న అభ్యర్థుల కోసం గ్రేడ్-ఎ లా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల వృత్తిపరమైన అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు నెలవారీ జీతం అందుతుంది.

ఇవి కూడా చదవండి

IOCLలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కెమిస్ట్రీ అభ్యర్థులకు కూడా ఛాన్స్

అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (గ్రేడ్-A0) పోస్టులకు కెమిస్ట్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు వేతనం లభిస్తుంది.

డిప్లొమా అభ్యర్థులకు జూనియర్ పోస్టులు

డిప్లొమా పూర్తి చేసిన యువతకు కూడా IOCL మంచి అవకాశం కల్పిస్తోంది. జూనియర్ ఇంజినీర్, జూనియర్ ఆఫీసర్ (గ్రేడ్-E0) పోస్టులను ఎలక్ట్రికల్, మెకానికల్, సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ముందస్తు పని అనుభవం అవసరం లేదు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతం అందుతుంది.

IOCLలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 31, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాల ఆధారంగా సంబంధిత పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు సెప్టెంబర్ 24, 2026న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా నిర్దేశించిన అర్హతలు, అనుభవం, ఇతర నిబంధనలను తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి.

IOCLలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us