AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఇటీవల భారీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
Bank of Baroda LBO Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 24, 2026 | 3:49 PM

Share

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఒక సంవత్సరం పోస్ట్‌-క్వాలిఫికేషన్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 1, 2026వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్ధులు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు 15 సంవత్సరాలు వరకు వయోసడలింపు ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, అనుభవం, స్థానిక భాషకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ఫీజు చెల్లించిన అనంతరం దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని భవిష్యత్‌ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్‌ఎం/ మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తారు. ఇందులో ప్రధానంగా ఆన్‌లైన్‌ పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (GD)/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతంగా లభిస్తుంది. దీనికి అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం

ఆన్‌లైన్‌ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. పరీక్షకు 120 నిమిషాల సమయం కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. ఇంగ్లిష్ విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కులు, జనరల్/ఎకానామిక్ అవేర్‌నెస్ విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కులు, రీజనింగ్ & క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కులు చొప్పున కేటాయిస్తారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us