అప్పన్న బంగారం మోసం కేసు: విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాల విక్రయం పేరిట జరిగిన మోసంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

అప్పన్న బంగారం మోసం కేసు: విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

Edited By:

Updated on: Sep 05, 2020 | 7:16 PM

Simhachalam Appanna Swamy: సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాల విక్రయం పేరిట జరిగిన మోసంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి అజాద్ పర్యవేక్షణలో కమిటీ విచారణను మొదలుపెట్టింది. అయితే అప్పన్న ఆలయానికి సంబంధించిన బంగారం అమ్ముతామంటూ మొన్నటివరకు ఈవోగా పనిచేసిన భ్రమరాంబ పేరుతో నోటీసు రావడం కలకలం రేపింది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కొత్తగా ఈవో బాధ్యతలు చేపట్టిన త్రినాధరావు అధికారులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో దేవస్థానం పేరుతో రసీదును ఎక్కడ ముద్రించారు..? ఆలయ సిబ్బంది పాత్ర ఎంత ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆజాద్ వెల్లడించారు.  మరోవైపు ఈవో పేరుతో స్టాంపు కూడా ఉండటంతో అది నిజమని నమ్మి హైమావతి అనే మహిళకు బ్యాంకు ద్వారా కొంత అమౌంట్‌ ట్రాన్ఫర్ చేసినట్టు శ్రావణి అనే మహిళ చెబుతున్నారు. ఈ క్రమంలోహైమావతికి సహకరించిన దేవాదాయశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మధు, శేఖర్‌లపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Read More:

ఉద్యోగులకు ‘గూగుల్’ గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌

Prabhas AdiPurush: ఆ పాత్రకు ఎవరు సెట్ అవుతారు!