ఉద్యోగులకు ‘గూగుల్’ గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌

ఉద్యోగుల విషయంలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వేళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బంది పడుతున్న తమ ఉద్యోగులకు

  • Tv9 Telugu
  • Publish Date - 6:13 pm, Sat, 5 September 20
ఉద్యోగులకు 'గూగుల్' గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌

Friday off for Google employees: ఉద్యోగుల విషయంలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వేళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బంది పడుతున్న తమ ఉద్యోగులకు అదనంగా ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఈ అవకాశం కల్పించినట్లు  సీఎన్‌బీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఉద్యోగులతో పాటు ఇంటర్న్‌లకు కూడా వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇకవేళ అత్యవసర పరిస్థితుల్లో శుక్రవారం పనిచేయాల్సి వస్తే.. వారు మరొక రోజును సెలవుగా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. డే ఆఫ్‌ను కల్పించేందుకు మేనేజర్లు, వారి బృంద సభ్యులకు మద్దతుగా నిలవాలని గూగుల్ సూచించింది. వచ్చే ఏడాది మధ్య వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వైపే మొగ్గు చూపుతున్న తరుణంలోనే.. ఈ ఫోర్‌ డే వీక్‌ని కంపెనీ ప్రకటించింది. కాగా కరోనా నేపథ్యంలో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని ఇచ్చాయి. ఈ క్రమంలో పనిభారం పెరుగుతుందని, విశ్రాంతి దొరకడం లేదని గూగుల్‌ ఉద్యోగుల నుంచి ఫిర్యాదుల వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనర్హం.

Read More:

ఆ పాత్రకు ఎవరు సెట్ అవుతారు!

వైరల్‌ అవుతోన్న ఎన్నికల షెడ్యూల్‌.. స్పందించిన నిమ్మగడ్డ