ఎండలు ఠారెత్తిస్తున్నాయి

హైదరాబాద్‌: నగరంలో సాధారణ కంటే పగటి ఉష్ణోగ్రతలు 2డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో వాతావరణం వేడేక్కుతోంది. మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. గురువారం గరిష్ఠంగా 34.6. కనిష్ఠంగా 21.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బేగంపేట వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఎండ లు పెరగడంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు 24 గంటలు వాడేస్తున్నారు. ప్రధానంగా దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తుండడంతో పొడివాతావరణం నెలకొని […]

ఎండలు ఠారెత్తిస్తున్నాయి

Updated on: Feb 22, 2019 | 3:02 PM

హైదరాబాద్‌: నగరంలో సాధారణ కంటే పగటి ఉష్ణోగ్రతలు 2డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో వాతావరణం వేడేక్కుతోంది. మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. గురువారం గరిష్ఠంగా 34.6. కనిష్ఠంగా 21.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బేగంపేట వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఎండ లు పెరగడంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు 24 గంటలు వాడేస్తున్నారు.
ప్రధానంగా దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తుండడంతో పొడివాతావరణం నెలకొని గాలిలో తేమశాతం తగ్గుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీలుగా నమోదవుతుండడంతో ఇళ్లలో ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితులు నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పెరగడంతో వేడిగాలు ల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు.