విశాఖ చేరువలో విరిసిన కశ్మీరం.. కనువిందు చేస్తున్న పూలసాగు..

|

Apr 04, 2022 | 6:20 PM

విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కశ్మీర్‌, ఊటి అందాలు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ఏజెన్సీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పూలసాగు..

విశాఖ చేరువలో విరిసిన కశ్మీరం.. కనువిందు చేస్తున్న పూలసాగు..
Flowers
Follow us on

విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కశ్మీర్‌, ఊటి అందాలు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ఏజెన్సీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పూలసాగు..సక్సెస్‌ ఫుల్‌గా సాగుతోంది. విరబూసిన రంగురంగుల పూలతో ఇక్కడి వ్యవసాయ పరిశోధన కేంద్రం కొత్త సొబగులు అద్దుకుంటోంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అమలు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ప్రాజెక్టు ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. స్థానిక రైతులు అధిక ఆదాయం పొందేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును గతేడాది ప్రారంభించారు. గిరిజన రైతులు అధిక ఆదాయం కోసం వేరే మార్గాలను అనుసరించకుండా.. పూలు, ఇతర పంటల సాగుపై ప్రణాళికలతో ఈ పూల సాగు చేస్తున్నారు.

శాస్త్రవేత్తలతో కలిసి ఇక్కడి పరిశోధన కేంద్రంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పూల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో వివిధ రకాల పూలమొక్కలు సాగు చేస్తున్నారు. గ్లాడియోలస్‌, తులిప్‌, గులాబీలు, జర్‌బరా, డాలీఫ్లవర్స్‌ వంటి అనేక రకాల పూల మొక్కలను సాగుచేస్తున్నారు. ఈ పూల సాగును పూర్తిగా ఆర్గానిక్‌ పద్ధతిలోనే చేపడుతున్నారు. ఇక్కడి గిరిజనులు గంజాయి సాగు వైపు వెళ్లకుండా అధిక ఆదాయం వచ్చే పూలు, ఇతర పంటల సాగువైపు అడుగులు వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రకశ్మీర్, లంబసింగి, ఆంధ్ర ఊటీ అరకు పర్యాటక పరంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఇక్కడకు పర్యాటకుల తాకిడి పెరిగింది. గిరిజన రైతులు పూలసాగు ద్వారా మార్కెటింగ్ చేస్తూ అధిక ఆదాయాన్ని పొందవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పూలసాగును పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలోనే చేపడుతున్నారు.

Also Read: Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..

Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..