అమ్మో.. ఒకే ఇంట్లో ఇన్ని పాములా…!

మన ఇంట్లో ఒక్క పాము కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అదే పదుల సంఖ్యలో పాములుంటే ఇంకేమైనా ఉందా..కానీ అక్కడ మాత్రం ఒకటి..రెండు కాదు..

అమ్మో.. ఒకే ఇంట్లో ఇన్ని పాములా...!
Follow us

|

Updated on: May 22, 2020 | 9:35 AM

మన ఇంట్లో ఒక్క పాము కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అదే పదుల సంఖ్యలో పాములుంటే ఇంకేమైనా ఉందా..కానీ అక్కడ మాత్రం ఒకటి..రెండు కాదు..వందల సంఖ్యలో స్నేక్స్‌..చీమల పుట్టల తరహాలోనే గుట్టల గుట్టల పాము పిల్లలు బయటికొస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లా రాన్‌లో ఏకంగా ఓ ఇంటినే కబ్జా చేసేశాయి స్నేక్స్‌. రాత్రి అయిందంటే చాలు. పదుల సంఖ్యలో పాము పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇల్లంతా కలియతిరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 123 పాము పిల్లలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో హడలిపోయిన ఇంటి యజమాని జీవన్‌ సింగ్‌ కుష్వాహ్‌ అటవీ శాఖాధికారులకు సమాచారమిచ్చాడు.

జీవన్‌ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖాధికారులు..మొత్తం 123 పాము పిల్లలను పట్టుకున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో పరిశీలించారు. ఐతే కొద్ది రోజుల కిందట పాములు ఆ ఇంట్లో గుడ్లు పొదిగాయని..వాటి నుంచే పిల్లలు బయటకొస్తున్నాయని తేల్చారు. అవన్నీ అత్యంత విషపూరితమైన బ్లాక్‌ కోబ్రాస్‌ అని..కాటేస్తే చనిపోయే ప్రమాదముందని వెల్లడించారు. పెద్ద పాముల కంటే..పిల్ల పాముల్లోనే పెద్ద మొత్తంలో విషముంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వాటికి విషాన్ని దాచే అవయవం తయారవకపోవడం వల్ల.. విషం మొత్తం కక్కేస్తాయని తెలిపారు. ప్రస్తుతం అతని ఇంట్లోని నేలను తవ్వి పాముల స్థావరాన్ని వెతుకుతున్నారు. గతంలో జీవన్ ఇంటి స్థలంలో పాముల పుట్టలు ఉండేవని గ్రామస్థులు అంటున్నారు.

Latest Articles