అతనో రౌడీషీటర్. తనను చూస్తే అంతా భయపడతారని, ఏం చేసినా పడతారని అనుకున్నాడో ఏమో… విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం తెలిసి స్థానిక మహిళలకు చిర్రెత్తుకొచ్చింది. ప్రతి మహిళా.. మహిషాసుర మర్దినిలా మారింది. దారి తప్పిన రౌడీసీటర్ బొక్కలు విరగొట్టారు. సందులో పట్టుకొని చావబాదారు. బట్టలూడదీసి మరీ రక్తాలు కారేలా కొట్టారు. మరోసారి మహిళవైపు కన్నెత్తి చూడాలంటేనే వెన్నులో వణుకుపుట్టేలా వాయించేశారు. అతడి పేరు చిన్నారావు అట. చదువుకునే పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తే.. కథ వేరే ఉంటుందని మహిళలు తమ చేతల్తో చెప్పేశారు. వారికి ఎంతగా కోపం వస్తే.. ఆ స్థాయిలో ఉతికారో మనం అర్థం చేసుకోవచ్చు.
విశాఖపట్నం మల్కాపురం GVMC హైస్కూల్ దగ్గర రౌడీషీటర్‌కు దేహశుద్ది చేశారు మహిళలు. స్కూల్‌కి వచ్చి విద్యార్థినిలను చాక్లెట్లు ఇస్తామంటూ ఇంటికి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళలు రెచ్చిపోయారు. బట్టలు చి౦చేసి, రక్తం వచ్చేట్టు కొట్టారు. చెప్పులతో చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దంపతుల ప్రాణాలు బలి తీసుకున్న మరో తాగుబోతు.. రీడింగ్ చూస్తే షాక్