ఆపరేషన్ వశిష్ఠ స్టార్ట్..! బోటు పైకొచ్చేనా..?

| Edited By:

Sep 30, 2019 | 12:42 PM

ఈ నెల 16న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద.. అదుపు తప్పి బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో 36మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 16మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి. విపరీతమైన వర్షాలు, వరద ప్రవాహం, ఇరుకు ప్రాంతం, సుడిగుండాలు, బోటు 210 అడుగుల లోతులో ఇరుక్కుపోవడం వంటి కారణాలు […]

ఆపరేషన్ వశిష్ఠ స్టార్ట్..! బోటు పైకొచ్చేనా..?
Follow us on

ఈ నెల 16న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద.. అదుపు తప్పి బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో 36మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 16మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి. విపరీతమైన వర్షాలు, వరద ప్రవాహం, ఇరుకు ప్రాంతం, సుడిగుండాలు, బోటు 210 అడుగుల లోతులో ఇరుక్కుపోవడం వంటి కారణాలు వెలికితీతకు ఆటంకాలుగా మారుతున్నాయి.

మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మునిగిపోయిన బోట్లను వెలికితీయటంలో నిపుణులైన ధర్మాడి సత్యం బృందం బయలుదేరింది. భారీ సామగ్రిని దేవీపట్నం పోలీసు స్టేషన్​ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి ప్రత్యేక బోటులు తరలిస్తున్నారు.

ఈరోజు ఉదయమే ఆపరేషన్ వశిష్ఠ మొదలైంది.. ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసే పని మొదలు పెట్టింది. ఆదివారమే సత్యం బోటు ఆపరేషన్ పనిని మొదలు పెట్టినా.. బోటు మునిగిన ప్రాంతానికి.. మెటీరియల్‌ని తీసుకెళ్లడం చాలా కష్టంగా మారింది. అందుకోసం ప్రత్యేకంగా రోడ్డు వేసి.. మెటీరియల్‌ను చేర్చారు. ధర్మాడి సత్యం టీం ఇవాళ నదిలోకి దిగనుంది. ఈ టీం బోటు.. నీళ్లల్లో ఎక్కడుందో కనిపెట్టాలి. నిజానికి ఈ బోటు మునిగి 15 రోజులవుతోంది. గోదావరి వేగం మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. మునిగిన ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. బోటు జాడ కనిపెట్టడం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పని.

కాగా.. బోటు వెలికితీత కోసం.. పెద్ద పెద్ద లంగర్లని, రోప్‌లను ఉపయోగిస్తున్నారు. దాదాపు ఒక లంగర్‌ని పది మోసేంత బరువున్న లంగర్లని తీసుకొచ్చారు ధర్మాడి సత్యం టీం. వీటి సహాయంతో.. బోటును పట్టుకుని వెలికితీసే ప్రయత్నం చేస్తామని టీం తెలిపింది. ఈ టీమ్‌లో 22 మంది నిపుణులు, 25 మంది మత్స్యకారులు ఉన్నారు. కాగా.. బోటు వెలికితీసే సమయంలో ప్రమాద స్థలం వద్దకు ఎవరూ రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు 144 సెక్షన్​ను విధించారు. పెద్ద పెద్ద రోప్​లు, లంగర్లతో ధర్మాన సత్యం బృందం ప్రమాదం జరిగిన కచ్చులూరు కొండవద్దకు బయలుదేరటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైనా.. బోటును బయటికి వెలికి తీయాలని బాధితుల బంధువులు కోరుకుంటున్నారు.