AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోరు బావిలో గ్యాస్… ఎగిసిపడుతున్న మంటలు

బోరు బావి నుంచి నీరు రావాలి కానీ అక్కడ గ్యాస్ వస్తోంది. అంతే కాదు ఆ గ్యాస్ నిరంతరాయంగా వస్తుండటంతో మంటలు కూడా చిమ్ముతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో వరుస గ్యాస్‌ లీకేజీలు కలకలం రేపుతున్నాయి. నిన్న రాత్రి కోనపోతుగుంట గ్రామంలో చేతి పంపు నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. గ్రామానికి చెందిన యేసుబాబు ఏడేళ్ల క్రితం ఇంటి పెరట్లో మంచినీటి కోసం బోరు వేయించాడు. ఐదేళ్ల నుంచి నీరు రాకపోవడంతో అలాగే వదిలేశాడు. […]

బోరు బావిలో గ్యాస్... ఎగిసిపడుతున్న మంటలు
Sanjay Kasula
|

Updated on: May 29, 2020 | 10:56 AM

Share

బోరు బావి నుంచి నీరు రావాలి కానీ అక్కడ గ్యాస్ వస్తోంది. అంతే కాదు ఆ గ్యాస్ నిరంతరాయంగా వస్తుండటంతో మంటలు కూడా చిమ్ముతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో వరుస గ్యాస్‌ లీకేజీలు కలకలం రేపుతున్నాయి. నిన్న రాత్రి కోనపోతుగుంట గ్రామంలో చేతి పంపు నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. గ్రామానికి చెందిన యేసుబాబు ఏడేళ్ల క్రితం ఇంటి పెరట్లో మంచినీటి కోసం బోరు వేయించాడు. ఐదేళ్ల నుంచి నీరు రాకపోవడంతో అలాగే వదిలేశాడు. అయితే గురువారం మధ్యాహ్నం నుంచి బోరులో నీరు తన్నుకు రావడం ప్రారంభమైంది. దీంతో గురువారం రాత్రి 10 గంటల సమయంలో బోరుకు చేతి పంపు ఏర్పాటు చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అర గంట పాటు ప్రయత్నించి మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత చేతి పంపును తొలగించారు.

అయితే బోరుకు వేసిన చేతి పంపును తొలగించినా బోరు నుంచి నీరు బయటకు వస్తూనే ఉంది. గ్యాస్‌ వాసన రావడంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో ఓఎన్‌జీసీ (ONGC) అధికారులకు సమాచారం అందించారు రెవెన్యూ అధికారులు. పాలకొల్లు సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే స్థానికులు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
మహిళలు ఇంట్లోనే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? బెస్ట్ ఆప్షన్..
మహిళలు ఇంట్లోనే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? బెస్ట్ ఆప్షన్..
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా