విజయనగరంలో ఘోర ప్రమాదం.. రోడ్డున పడ్డ 40 గిరిజన కుటుంబాలు.. ఒంటిమీద బట్టలతో నిరాశ్రయిలుగా..

|

Mar 05, 2021 | 10:03 PM

ఒక అగ్ని ప్రమాదం...! 40 కుటుంబాలను రోడ్డున పడేసింది. వందల మందిని గిరిజన పేదలను నిరాశ్రయులను చేసింది. కావాల్సినవి, ఇష్టమైనవి, దాచుకున్నవి, ఇన్ని రోజులు భద్రంగా కాపాడుకున్నవీ

విజయనగరంలో ఘోర ప్రమాదం.. రోడ్డున పడ్డ 40 గిరిజన కుటుంబాలు.. ఒంటిమీద బట్టలతో నిరాశ్రయిలుగా..
Follow us on
ఒక అగ్ని ప్రమాదం…! 40 కుటుంబాలను రోడ్డున పడేసింది. వందల మందిని గిరిజన పేదలను నిరాశ్రయులను చేసింది. కావాల్సినవి, ఇష్టమైనవి, దాచుకున్నవి, ఇన్ని రోజులు భద్రంగా కాపాడుకున్నవీ అని తేడా లేకుండా అన్నీ అగ్నికి మంటల్లో కలిసిపోయాయి. గాలిని తనలో కలుపుకుంటూ వేగంగా వ్యాపించిన రాకాసి మంటలు..తీరని ఆవేదనను మిగిల్చాయి. మనకు స్క్రీన్‌ పైన మపం చూస్తున్నాం. ఓవైపు వేగంగా వ్యాపిస్తున్న మంటలు..మరోవైపు నిత్యవసరాలను అగ్ని జ్వాలల నుంచి రక్షించుకునేందుకు వాళ్లు పడుతున్న వేదన. తమ సర్వస్వం అగ్నికి ఆహుతవుతున్నాయన్న బాధ లోపల దహిస్తున్నా..వారు చేసిన పోరాటం మాటల్లో చెప్పలేనిది. చిన్నా, పెద్ద అనే తేడా లేదు.. అంతా కలిసికట్టుగా అందింది అందినట్టు తీసి బయటకు తీసుకెళ్లారు. బట్టలు, మంచం, గ్యాస్ సిలీండర్లు.. ఇలా ఏది కనబడితే అది. తన మోయలేని బరువులను కూడా అవలీలగా ఎత్తి పడేశారు. పట్టుకుని మంటలకు దూరంగా పరుగులు తీశారు. వారి ఆవేదన కంటే వేగంగా కమ్ముకొచ్చిన మంటలు…చివరకు వారి సంతోషాన్ని కూడా తీసుకెళ్లిపోయాయి.
మేము చెప్తున్నది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లి పరిధిలోని కొండవానిపాలెం అగ్ని ప్రమాదం గురించి. ఇక్కడి గిరజన పేదలకు శుక్రవారం నాటి అగ్ని ప్రమాదం పీడకలను మిగిల్చింది. మొదట ఒక ఇంట్లో చిన్నగా మొదలైన అగ్ని ఖిలలు..క్షణాల్లో 40 ఇళ్లను చుట్టేశాయి. చూస్తుండగానే మొత్తం నిప్పుల కొలిమిగా మారిపోయింది. అన్నీ పూరి గుడిసెలు, అవి కూడా పక్కపక్కనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైనట్టు మనకు విజువల్స్‌ చూస్తే అర్థమవుతోంది. వాటికి తోడు వేగంగా వీచిన గాలి…మంటలను మరింత ఉధృతమయ్యేలా చేసింది. కళ్లముందే కాలి బూడిదవుతున్నా…ఉవ్వెత్తున అగ్ని ఖిలలను ఆపలేక, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బాధితులు ఉండిపోయారు. తమ వస్తువులను రక్షించుకునేందుకు చిన్నా, పెద్ద తీవ్రంగా శ్రమించారు. అయినా..కొంత సమాగ్రిని బయటకు తీసుకునే లోపే అగ్ని జ్వాలలు గుడిసెలన్నింటినీ తాకాయి. గుడిసెల పైకప్పు పూర్తిగా ఎండిపోయి ఉండడంతో..మంటలు అంటుకున్న క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయాయి. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 40 కుటుంబాల కష్టం క్షణాల్లో కాలి బూడిదైపోయింది. నిలువ నీడ లేక 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో…అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు…భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Also Read: