ఎండకాలం ఎంటర్ కాకుండానే భానుడి భగభగలు.. కోల్‌బెల్ట్‌ ఏరియాలో మాడు పగిలిపోతుంది.. వివరాలు

ఎండకాలం రానే లేదు భానుడి భగభగలతో కోల్‌బెల్ట్‌ ఏరియా మండి పోతోంది. మార్చి మొదటి వారంలోనే సింగరేణి ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది.

  • Ram Naramaneni
  • Publish Date - 8:25 pm, Fri, 5 March 21
ఎండకాలం ఎంటర్ కాకుండానే భానుడి భగభగలు.. కోల్‌బెల్ట్‌ ఏరియాలో మాడు పగిలిపోతుంది.. వివరాలు

ఎండకాలం రానే లేదు భానుడి భగభగలతో కోల్‌బెల్ట్‌ ఏరియా మండి పోతోంది. మార్చి మొదటి వారంలోనే సింగరేణి ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో ఓపెన్ కాస్ట్ గనులైతే అగ్నిగుండంలా మారుతున్నాయి.

మంచిర్యాల , కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో భానుడు భగ్గుమంటున్నాడు. సింగరేణి ఏరియాలు శ్రీరాంపూర్ , బెల్లంపలి, గోలేటి, మందమర్రి అగ్నిగుండంలా మారుతున్నాయి. 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, వేడి, ఉక్కపోతతో సింగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు. సింగరేణి భూగర్బ గనుల్లో కాస్త పరిస్థితి బెటర్ గా ఉంటే… ఉపరితల బొగ్గు బావుల్లోని కార్మికుల కష్టాలు మాత్రం మరోలా ఉన్నాయి. తీవ్రమైన వడగాలులు ఉక్కపోతతో విదులు నిర్వహించాలంటే నరకం లా ఉందంటున్నారు ఓపెన్ కాస్ట్ గని కార్మికులు.

200 మీటర్ల లోతున, 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత నడుమ బొగ్గును కార్మికులు వెలికితీస్తున్నారు. ఎండలు పెరిగిన ఈ టైమ్‌లో మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, చల్లటి నీటితోపాటు వైద్య అవసరాల కోసం ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. అయితే ప్రతి వేసవి కాలంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నామని.. కానీ ఈ ఏడాది ఎండకాలం కంటే ముందే భానుడి భగభగలు కనిపిస్తుండటంతో ముందస్తుగా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని అధికారలు అంటున్నారు. మరోవైపు ఇప్పుడే ఇలా ఉంటే మండు వేసవిలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. మైదానం ప్రాంతాల్లోనే మండు వేసవి వాతవరణం కనిపిస్తుంటే ఓపెన్ కాస్టుల్లో అయితే సన్ ఎఫెక్ట్ మరింతగా ఉంది.

Also Read:

ఈ టాలీవుడ్ టాప్ హీరో తనయుడు ఎవరో గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్…?

అక్కడి పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం.. మీటర్ “0”నే ఉంటుంది… కానీ.. మీరు కూడా ఇలా మోసపోతున్నారా..?