కరోనా ఎఫెక్ట్‌.. ఉద్యోగుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరుమలలో దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా నేపథ్యంలో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కరోనా ఎఫెక్ట్‌.. ఉద్యోగుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

Edited By:

Updated on: Jun 29, 2020 | 7:49 PM

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరుమలలో దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా నేపథ్యంలో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులకు క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు రోజుకు వంద టెస్ట్‌లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. ఇక ఈ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా బర్డ్ ఆసుపత్రిని కరోనా రోగులకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని అనిల్ పేర్కొన్నారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు వారం రోజులు ఒకేచోట విధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.