AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాటు.. మూడు నెలల చిన్నారి మృతి

కోవిడ్ మహమ్మారి తెలంగాణను వణికిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. కరోనా వైరస్ బారిన పడి మూడు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన..

కరోనా కాటు.. మూడు నెలల చిన్నారి మృతి
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2020 | 6:01 PM

Share

కోవిడ్ మహమ్మారి తెలంగాణను వణికిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. కరోనా వైరస్ బారిన పడి మూడు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ముదిగొండకు చెందిన చిన్నారికి మెదడు, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతో ఖమ్మంలోని పలు ప్రయివేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. కానీ ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే చిన్నారికి కోవిడ్ టెస్టులు చేయగా, బుధవారం వచ్చిన రిజల్ట్స్‌లో బాబుకు పాజిటివ్ అని తేలింది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం కొత్తగూడెం జిల్లాలో ఆరు, ఖమ్మంలో నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Follow Us