శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంట శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
Hydroelectric Plant Fire: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంట శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్న కేసీఆర్.. ఫ్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. ప్రమాద స్థలంలో మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు ఉండగా.. వారితో కేసీఆర్ మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. కాగా గురువారం రాత్రి విద్యుత్ తయారీ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో భారీ పేలుడు సంభవించి, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో అందులో పనిచేసే పది మంది వెంటనే బయటికి వచ్చేయగా.. మరో తొమ్మిది మంది లోపల చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని బయటకు తెచ్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read More:
ఐఆర్‌సీటీసీలో మరికొంత వాటా విక్రయానికి సన్నాహాలు