
పదేళ్ల క్రితం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏడేళ్ల చిన్నారి వేపాడ దివ్య దారుణ హత్యకు గురైంది. దివ్య కనిపించకపోవడంతో.. గ్రామంలో దండోరా వేశారు. పోలీసుల రంగంలోకి దిగారు. చివరకు నిందితుడిని పట్టుకొని కటకటాల వెనుక నెట్టారు పోలీసులు. ఆధారాలతో.. న్యాయస్థానం ముందు చార్జిషీట్ ఫైల్ చేశారు. కేసులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు పోలీసులు నిందితుడు పై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. మరణ శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పు చెప్పింది కోర్ట్. చోడవరం కోర్టు చరిత్రలోనే మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం ఇదే తొలిసారి.
వివరాల్లోకి వెళితే.. 2015.. డిసెంబర్ నెల.. 22 వ తేదీ.. అప్పటి ఉమ్మడి విశాఖ జిల్లా ఇప్పటి అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి గ్రామం. స్కూలుకు వెళ్లిన ఆరెళ్ల చిన్నారి వేపాడ దివ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు గుండెలు పట్టుకున్నారు. ఊరంతా వెతికారు. కనిపించకపోయేసరికి పోలీసులను ఆశ్రయించారు. 23న కేసు నమోదు చేసిన పోలీసులు.. దండోరా వేయించారు పోలీసులు. ఈలోగా బిల్లలమెట్ట ప్రాంతంలో బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. గొంతు పై పదునైన వస్తువులతో గాయపరిచి హత్య చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. చివరకు ఆ చిన్నారిని అతి దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో నిందితుడు గుణ శేఖర్ ను విచారించి నిన్ను చూడగా గెలిచారు. అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
కోర్టు చరిత్రలోనే సంచలన తీర్పు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల చిన్నారి వేపాడ దివ్య హత్య కేసు కు సంబంధించి పోలీసులు పూర్తి ఆధారాలను సేకరించి.. కోర్టు ముందు పెట్టారు. చార్జి షీట్ ఫైల్ చేశారు పోలీసులు. సాక్షాధారణలను పరిశీలించిన చోడవరం కోర్టు.. సంచలన తీర్పు చెప్పింది. అభం శుభం ఎరుగని చిన్నారి దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు గుణశేఖర్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. అనకాపల్లి జిల్లా, చోడవరం చోడవరం 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి కే. రత్నకుమార్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ ఉగ్గిన వెంకట రావు. ఈ తీర్పు వందేళ్ళ చరిత్ర కలిగిన చోడవరం కోర్టు చరిత్రలోనే ప్రధమమని అంటున్నారు న్యాయవాదులు అల్లు గిరిధర్ సుబ్బలక్ష్మి. నేర ప్రవృత్తి కలిగిన వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం అని అభివర్ణిస్తున్నారు.
బాలిక హత్యకు కారణమైన నిందితునికి U/Sec 302 IPC ప్రకారం దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది కోర్ట్. అంతేకాకుండా పది వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసును చేధించి, న్యాయస్థానం ముందు పటిష్టమైన సాక్షాధారాలు ఉంచి నిందితునికి ఉరి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. సుదీర్ఘంగా విచారణ జరిగి ఈ రోజు న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగిందని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోజు జరిగింది ఇదే..
2015 డిసెంబరు చివరి వారంలో చిన్నారి దివ్య హత్య ఘటన జరిగింది. కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దివ్య తల్లిదండ్రులకు.. నిందితుడు గుణ శేఖర్ కు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో కక్ష పెంచుకున్న గుణశేఖర్.. దివ్య ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం స్కూలుకి తల్లి తీసుకెళ్ళింది. సాయంత్రం.. చిన్నారి మాయమైంది. నిందితుడు గుణశేఖర్.. చిన్నారి దివ్య ను మాటల్లో పెట్టాడు. 20 రూపాయలు ఇచ్చి గారెలు కొనుక్కోవాలని ఆశ చూపాడు. ఆ తర్వాత తన బైక్ పై ఎక్కించుకొని.. గ్రామ శివారు రిజర్వాయర్ వెనుక వైపు బిల్లల మెట్ట ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బీరు బాటిల్ను చితక్కొట్టి.. ఆ గాజు పెంపులతో చిన్నారి గొంతు కోసేసాడు. అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టుగా పోలీసులు వివరించారు.
పోలీసుల విచారణలో ఏం తేలిందంటే…
వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు ఉపాధి కోసం అనకాపల్లి జిల్లా వచ్చారు. గొల్లపేట వీధి, దేవరపల్లి గ్రామంలో హోటల్ను నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె వేపాడ దివ్య. వయస్సు ఏడేళ్ల. స్థానికంగా ఉన్న ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుకుంటుంది. తాము నిర్వహిస్తున్న హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారి అలియాస్ తంబి ని పనికి కుదుర్చుకున్నారు. గుణశేఖర్.. పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉండడంతో.. అతని ప్రవర్తనతో విసిగి వేసారిన ధనలక్ష్మి, మురుగన్ దంపతులు గుణశేఖర్ ను పనిలో నుండి తొలగించారు. దీంతో అవమానంగా భావించిన గుణశేఖర్.. కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అవకాశం కోసం ఎదురుచూసాడు. మురుగన్ ధనలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె చిన్నారి దివ్య హత్యకు ప్లాన్ చేశాడు. అతి కిరాతకంగా చంపేశాడు. నిందితుడు సుబ్బాచారిపై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు నమోదు అయిఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.