“దిశ” ఘటన నిందితుల గురించి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన “దిశ” ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ.. దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన నోటికి పదునుపెట్టారు. ఒకవేళ దిశ ఘటనలోని నిందితులు.. కోర్టు నుంచి తప్పించుకున్నా.. లేక జైలు నుంచి […]

దిశ ఘటన నిందితుల గురించి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 1:06 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన “దిశ” ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ.. దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన నోటికి పదునుపెట్టారు. ఒకవేళ దిశ ఘటనలోని నిందితులు.. కోర్టు నుంచి తప్పించుకున్నా.. లేక జైలు నుంచి తప్పించుకున్నా.. తన నుంచి మాత్రం తప్పించుకోలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశను ఏ విధంగా అయితే దారుణంగా హత్య చేశారో.. నిందితులైన ఆ నలుగురికి కూడా అదే శిక్ష పడుతుందన్నారు.

కాగా, ఇదే ఘటనపై మృతురాలి అసలు పేరును ప్రస్తావించారన్న ఆరోపణలతో పాటు.. కేసులో అరెస్టైన నిందితుల గురించి చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. దిశ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు.. తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయనుంది.