పవన్ సవాల్.. ఎవరు ఆపుతారో చూస్తా.. మేము సింహాలం!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆయన రాయలసీమ పర్యటనలో భాగంగా.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌ను ఈ రోజు సందర్శించనున్న సంగతి తెలిసిందే. అయితే.. పవన్ మదనపల్లె మార్కెట్‌కి వెళ్లకూడదని.. వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పవన్ మాట్లాడుతూ.. మదనపల్లె మార్కెట్‌ను సందర్శించకుండా.. ఎవరు నన్ను ఆపుతారో చూస్తానని.. సవాల్ విసిరారు. మదనపల్లెలోని సీటీఎం రోడ్డులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. తన పర్యటనను అడ్డుకునే విధంగా […]

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆయన రాయలసీమ పర్యటనలో భాగంగా.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌ను ఈ రోజు సందర్శించనున్న సంగతి తెలిసిందే. అయితే.. పవన్ మదనపల్లె మార్కెట్‌కి వెళ్లకూడదని.. వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పవన్ మాట్లాడుతూ.. మదనపల్లె మార్కెట్‌ను సందర్శించకుండా.. ఎవరు నన్ను ఆపుతారో చూస్తానని.. సవాల్ విసిరారు.
మదనపల్లెలోని సీటీఎం రోడ్డులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. తన పర్యటనను అడ్డుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మార్కెడ్ యార్డు అధికారుల తీరుపై పవన్ విమర్శలు గుప్పించారు. మీ అనుమతి ఎవరికి కావాలి? మార్కెట్ యార్డుకు రానీయకుంటే.. రోడ్డుపైనే కూర్చుంటా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎంత ఆపితే.. నేను అంత మందుకెళ్తా.. మేం సింహాలం.. మేకలం కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇవాళ మదనపల్లిలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.